YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టిటిడి ఈఓ బదిలీ డిక్లరేషన్ వ్యవహారమే కారణమా ?

టిటిడి ఈఓ బదిలీ డిక్లరేషన్ వ్యవహారమే కారణమా ?

తిరుపతి తిరుమల అక్టోబర్ 1 
తిరుమల బ్రహ్మోత్సవాలు ముగియగానే జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా సడన్ గా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను బదిలీ చేసింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై ఎట్టకేలకు జగన్ సర్కార్ బదిలీ వేటు వేసింది. ఇటీవలే మరో  ఏడాదిపాటు అనిల్ కుమార్ ను  ఈవోగా కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ అకస్మాత్తుగా బదిలీ చేయడం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. డిల్లీ లోని ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ గా  ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను 2017 మే 6న టిటిడి ఈఓగా నియమించింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. ఉత్తరాది కి చెందిన వ్యక్తిని టిటిడి ఈఓ గా ఎలా నియమిస్తారంటూ అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. వాటన్నిటిని అధిగమిస్తూ టిటిడి ఈఓగా కొన్ని సంస్కరణలను సింఘాల్ తీసుకొచ్చారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి దాతల సహకారం కోరుతూ శ్రీవాణి ట్రస్ట్ పేరుతో నూతన డొనేషన్ స్కీమ్ ను తీసుకొచ్చారు. శ్రీవారి సేవా టికెట్లను ను అన్లైన్ లో పొందేలా చర్యలను తీసుకున్నారు. భక్తుల కోసం కొన్ని సంస్కరణలు తిసుకొచ్చినప్పటికి అదే రీతిలో విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. గత టిడిపి ప్రభుత్వ హాయంలో శ్రీవారి పింక్ డైమండ్ పోయిందంటూ అప్పటి ప్రతిపక్షం లో వైసిపి నాయకులు విజయసాయి రెడ్డి, శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన విమర్శల పై న్యాయస్థానం ను ఆశ్రయించినప్పటికీ తిరిగి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కేసును విత్ డ్రా చేసుకోవడంతో అనిల్ సింఘాల్ విమర్శలకు గురయ్యారు. ఇక టిటిడి ఈఓ  ఆకస్మిక బదిలీ పై టిటిడి ఉద్యోగ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటివల జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో డిక్లరేషన్ అంశం  వివాదాస్పదం కావడం, టిటిడి ఈఓగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ఈ విషయం పై స్పందించకపోవడంతోనే ఆయన పై వేటు వేసారని టిటిడి ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సింఘాల్ ను సాధారణ బదిలీ కింద పంపకుండా అత్యున్నత పోస్టును కట్టబెట్టింది. అనిల్ కుమార్ సింఘాల్ ను ఏకంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించడం విశేషం.

Related Posts