YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీకాళహస్తిఆలయంలో  గన్ మిస్ ఫైరింగ్ 

శ్రీకాళహస్తిఆలయంలో  గన్ మిస్ ఫైరింగ్ 

శ్రీకాళహస్తిఆలయంలో  గన్ మిస్ ఫైరింగ్ 
చిత్తూరు 
శ్రీకాళహస్తీశ్వర ఆలయం కంచు గడప సమీపంలోని గార్డ్ రూమ్ లో ఏఆర్ కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్  కావడంతో సుబ్రహ్మణ్యం అనే కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆలయ ఈవో పోలీసు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలాన్ని కి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఘటనపై  దర్యాప్తు చేపట్టారు. 
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో విధులు నిర్వహించే ఏఆర్ కానిస్టేబుల్ గన్  మిస్ ఫైర్ కావడం తో బుధవారం రాత్రి సర్వత్రా ఆందోళన నెలకొంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా  విధులు నిర్వహించే సుబ్రహ్మణ్యం బుధవారం రాత్రి విధులు ముగించుకొని తన గన్ ను కంచు  గడప సమీపంలో ఉన్న గార్డు రూమ్ లో డిపాజిట్ చేయడానికి వెళ్లారు. గన్ డిపాజిట్ చేసే సమయంలో అన్ లాక్  లో ఉన్న గన్ ను లాక్ చేసే సమయంలో గన్ ఫైరింగ్ అయింది. అయితే అదృష్టవశాత్తూ బుల్లెట్ పైకి దూసుకెళ్లి  గది స్లాబ్ కు తగలడంతో పెను ప్రమాదం తప్పింది. కానిస్టేబుల్  సుబ్రహ్మణ్యం చెవి వద్ద స్వల్ప గాయం కావడంతో తోటి కానిస్టేబుళ్లు అక్కడికక్కడే వైద్య చికిత్స అందించారు. 
ఘటన సమాచారం అందుకున్న ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, శ్రీకాళహస్తి డీఎస్పీ నాగేంద్రుడు,  సీఐ నాగార్జున రెడ్డి తదితర పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. సమాచారం అందుకున్న ఏ ఆర్ డి.ఎస్.పి శివరామ కిషోర్ తిరుపతి నుంచి హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 
పెను ప్రమాదం తప్పడంతో  ఆలయ అధికారులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒకే నెలలో రెండు సంచలనమైన ఘటనలు ఆలయంలో జరగడం భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వరస  అపచార ఘటనలు  ఏమిటి స్వామి అని భక్తులు ఆవేదన వ్యక్తం చేసే  పరిస్థితి నెలకొంది. మరోవైపు ఘటన జరిగిన కంచు గడప వరకు మీడియా వెళ్లే అవకాశం ఉన్నా ఆలయ అధికారులు ఎవర్ని అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆలయ అధికారులు దేవాదాయశాఖ పెట్టిన నిబంధనలకు మించి తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు మీడియాపై విపరీతమైన ఆంక్షలు పెట్టడం భక్తుల్లో చర్చనీయాంశంగా మారింది.  ఘటనపై ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ విధుల అనంతరం ఏఆర్ కానిస్టేబుల్ సుబ్రమణ్యం గన్ డిపాజిట్ చేసే సమయంలో మిస్  ఫైర్ అయిందని ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు.

Related Posts