హైదరాబాద్ లో ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య!
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ కు చెందిన అటవీశాఖ అధికారి వీ భాస్కర్ రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని నాగోల్ బండ్లగూడలో ఉన్న రాజీవ్ గృహకల్ప భవనం ఐదో అంతస్తు నుంచి దూకారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో కుమార్తె నివాసానికి వెళ్లి ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రమణమూర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 1987 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి అయిన రమణమూర్తి ప్రస్తుతం ఏపీ అటవీశాఖలో అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రమణమూర్తి మృతిపై ఎల్ బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి - దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.