YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గ్రాడ్యుయేట్ ఓటర్ గా తన పేరును నమోదు చేసుకున్న మంత్రి కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఓటర్ గా తన పేరును నమోదు చేసుకున్న మంత్రి కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఓటర్ గా తన పేరును నమోదు చేసుకున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ 
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ప్రారంభమైన ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా ఓటర్ లిస్టులో తన పేరును  మంత్రి కేటీఆర్ నమోదు చేసుకున్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం మరింతగా ఉందని మంత్రి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు అంతా తమ పేరుని ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకోవాలని ఎన్నికల్లో మొత్తం ఓటర్ లిస్ట్ తాజా ఓటర్ల నమోదు ఆధారంగానే ఉంటుందని గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. 2017 నవంబర్ నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు అందరూ ఓటర్ లిస్టు లో తమ పేరు నమోదు చేసుకునేందుకు అర్హులేనని, కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సూచించారు.

Related Posts