డీజీపీ తనలేఖను ఉపసంహరించుకొని, ప్రతిపక్షనేతకు క్షమాపణ చెప్పాలి
డీజీపీ తన ఉద్యోగం మానేసి, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం, వైసీపీవారి ఉద్యోగం చేస్తున్నాడు
కే.ఎస్.జవహర్
విజయవాడ
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డీజీపీకి లేఖరాస్తే, దానిపై సాక్ష్యాధారాలు ఇవ్వమని కోరుతూ ప్రతిపక్షనేతకు తిరుగులేఖ రాయడం ద్వారా సవాంగ్ తనస్థాయిని తనే దిగజార్చుకున్నాడని మాజీమంత్రి జవహర్ ఎద్దేవాచేశారు. గురువారం ఆయన తననివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. గౌతమ్ సవాంగ్ రాష్ట్రానికి పోలీస్ బాస్ గా పనిచేస్తున్నాడో, లేక వైసీపీ కింద పనిచేస్తున్నాడో ఆయనే చెప్పాలన్నారు. గతప్రభుత్వంలో మంచిఅధికారిగా పేరుపొందిన సవాంగ్, ఇప్పుడిలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో తెలియడ లేదన్నారు. 6 నెలలు సావాసం చేస్తే, వారు వీరు, వీరు వారు అవుతారని చెబుతుంటారని, జగనతో తిరిగీ తిరిగీ డీజీపీ కూడా అసమర్థుడిగా మారినట్లున్నారని మాజీమంత్రి దెప్పిపొడిచారు. చంద్రబాబుని సాక్ష్యాలు ఇవ్వమని అడగటంద్వారా పోలీసుల చేతగానితనాన్ని డీజీపీ తనకుతానుగానే అంగీకరించినట్లయిందని జవహర్ స్పష్టంచేశారు. డీజీపీ, టీడీపీ కార్యకర్తలను పోలీసులుగా నియమిస్తే, వారే ఆయన అడిగిన సాక్ష్యాలను సేకరించి, సవాంగ్ కు అందచేస్తారని మాజీమంత్రి దుయ్యబట్టారు.
చంద్రబాబుని సాక్ష్యాలు ఇవ్వమని అడుగుతూ నేడు లేఖరాసిన డీజీపీ, గతంలో అంతర్వేది రథాన్ని చంద్రబాబే తగలబెట్టించాడని విజయసాయిరెడ్డి అంటే, ఆనాడు ఆయనకు ఎందుకు లేఖరాయలేదో చెప్పాలన్నారు. అదేవిధంగా మంత్రిపెద్దిరెడ్డి టీడీపీవారే దళితులపై దాడిచేస్తున్నారు అన్నప్పుడు, హోంమంత్రి సుచరిత టీడీపీవాళ్లే హిందూమతంపై దాడిచేయిస్తున్నారు అన్నప్పుడు డీజీపీ వారినెందుకు సాక్ష్యాలు అడగలేదో చెప్పాలని మాజీమంత్రి నిలదీశారు. డీజీపీ ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో ఆయన చర్యలే చెబుతున్నా యన్నారు. పోలీసుల పని పోలీసులు చేయాలని, అలాకాకుండా ఇతరులపై నిందలు వేయాలని చూడటం ఏమిటన్నారు. కోర్టులు చీవాట్లు పెట్టాకైన డీజీపీ వైఖరి మారుతుందని అందరం అనుకున్నామని, ఇంతజరిగినా కూడా సవాంగ్ తనతీరు మార్చుకోలేదన్నారు. డీజీపీ ఇంకా జగన్ మత్తులోనే ఉన్నాడని, ఆయన తనమత్తువీడి, గతాన్ని గుర్తుచేసుకుంటే మంచిదన్నారు. జగన్ కేసులకు సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్ లు కోర్టులుచుట్టూ తిరిగిన విషయం ఆయనకు తెలియదా అని జవహర్ ప్రశ్నించారు. డీజీపీ ఆయన ఉద్యోగం చేసుకోకుండా, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం, వైసీపీ ఉద్యోగం చేయడం మానుకుంటే మంచిదని టీడీపీనేత చురకలు అంటించారు. డీజీపీ వైఖరి చూస్తుంటే, రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి, షాడో హోంమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లోకి వెళ్లినట్లుగా అర్థమవుతోందన్నారు.
దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాల్లో ప్రమేయమున్న పోలీస్ అధికారులు, రాజకీయ నేతల ఫోన్ కాల్ లిస్ట్ తీయకుండా డీజీపీ ఎందుకు తాత్సారం చేస్తున్నారని మాజీమంత్రి ప్రశ్నించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో బలవన్మరణానికి పాల్పడిన దళితుడి కాల్ లిస్ట్, రాజమహేంద్రవరంలో శిరోముండనం ఘటనలో కీలక నిందితుడి కాల్ లిస్ట్ ను ఎందుకు బయటపెట్టలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన శిరోముండనం ఘటనలో అసలుదోషిని వదిలేయడంద్వారా డీజీపీకి ఎంతముట్టిందో ఆయనే చెప్పాల న్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనో, జగన్ఆదేశాలతోనో డీజీపీ పనిచేస్తున్నారు తప్ప, తనకు తానుగా ఆయన ఏపనీ సొంతంగా చేయడంలేదన్నారు. ప్రభుత్వ చర్యలు, దుర్మార్గాలను, అధికారుల పనితీరుని ప్రజలెవరూ మర్చిపోరని, వారు తగినవిధంగా సమాధానం చెప్పితీరుతారని జవహర్ స్పష్టం చేశారు. చిత్తూరుజిల్లాలో దళితజడ్జీ రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడికి పాల్పడిన వ్యక్తి టీడీపీ వాడే అయితే, అతను స్థానికఎన్నికల్లో ప్రతిపక్షంతరుపున వేసిన నామినేషన్ ఎందుకు ఉపసంహరింపచేశాడో చెప్పాలన్నారు. స్థానిక ఎన్నికల్లో తనతల్లితో నామినేషన్ వేయించి, చివరకు అక్కడున్న ఎమ్మెల్యేతో లోపాయికారీ ఒప్పందంచేసుకొని, నామినేషన్ ను విత్ డ్రా చేయిస్తే, అతను టీడీపీ మనిషని పోలీసులు ఎలా చెబుతారన్నారు? పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తాను మనిషనే విషయం మర్చిపోయి, మాజీజడ్జీ రామకృష్ణను, వైద్యురాలు అనితారాణిని దుర్భాషలాడాడని, అటువంటి మంత్రిపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కేబినెట్లో ఉన్నవాళ్లలో మంచివాళ్లు మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని మించిపోయిమరీ మంత్రులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని జవహర్ ఆరోపించారు. దళితులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, జగన్మోహన్ రెడ్డి మౌనంగాఉంటే కుదరదన్నారు. క్రైస్తవ సమాధులును నేలమట్టంచేసి, వాటిలో పునాదులు వేసుకుందామనుకునేవారికి అవే సమాధులుగా మారుతాయని మాజీమంత్రి తేల్చిచెప్పారు. డీజీపీ ఇప్పటికైనా తాను చంద్రబాబుకి రాసిన లేఖను ఉపసంహరించుకొని, తన తప్పు ఒప్పుకొని, ప్రతిపక్షనేతకు బేషరతుగా క్షమాపణచెబితే మంచిదన్నారు. ఎవరి ప్రోద్భలంతో దళితులపై దాడులు, శిరోముండనాలు జరుగు