YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చప్పట్లతో అభినందనలు... జగన్ పిలుపు

చప్పట్లతో అభినందనలు... జగన్ పిలుపు

విజయవాడ, అక్టోబరు 1 
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి శుక్రవారంతో ఏడాది పూర్తవుతోంది. ప్రభుత్వ పాలనను ప్రతి ఇంటి ముందుకు తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థ  ప్రారంభించామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అవినీతికి తావు లేకుండా 543 సేవలను గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్నామన్నారు. అవినీతి రహిత పాలనను ప్రభుత్వం  అందిస్తోందని.. సచివాలయ పనితీరుని మన దేశ ప్రధాని నరేం‍ద్రమోదీ అభినందించారన్నారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ కూడా ప్రత్యేకంగా మన సచివాలయ వ్యవస్థని అభినందించారని మంత్రి  అన్నారు.యూపీఎస్సీ ట్రైనింగ్ సెంటర్ లో ఒక పాఠ్యాంశంగా మన సచివాలయ వ్యవస్థని చేర్చారని పెద్దిరెడ్డి తెలిపారు. 1,26,200 మంది ఇప్పటి వరకు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నారని.. 4  లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిది అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను అభినందించేందుకు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అందరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి అభినందించాలని కోరారు. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.61,65,000ల మందికి పెన్షన్లు గత నెల వరకు ఇస్తున్నామన్నారు మంత్రి. 34,907  మందిని గత నెల కొత్తగా పెన్షన్ ఇచ్చే జాబితాలో చేర్చామని.. గత ప్రభుత్వం లా కాకుండా తమ ప్రభుత్వంలో ఈ పెన్షన్‌ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది అన్నారు. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం సస్పెండ్  అయిన జడ్జ్ ద్వారా దళితులలో లబ్ది పొందాలి అని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు.  

Related Posts