YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వివేకా డ్రైవర్ ను ప్రశ్నించిన సీబీఐ

వివేకా డ్రైవర్ ను ప్రశ్నించిన సీబీఐ

కడప, అక్టోబరు 1 
మాజీ మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్‌లో గురువారం సీబీఐ  అధికారులు మరికొంతమందిని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి మాజీ కారు డ్రైవర్‌ దస్తగిరి విచారణకు హాజరయ్యారు. నాలుగు రోజుల క్రితం దస్తగిరి భార్యను షబానాను విచారణకు పిలిచిన అధికారులు..  ఇవాళ అతన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. దస్తగిరి వివేకా హత్యకు నాలుగు నెలలు ముందు మానేశాడు.. తర్వాత ఆయన స్థానంలో ప్రసాద్‌ అనే వ్యక్తి చేరాడు. కేసులో మాజీ డ్రైవర్‌ను ప్రశ్నించడం  ఆసక్తికరంగా మారింది. పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమానితో దస్తగిరికి సంబంధం ఉన్నట్లు సమాచారం. అందుకే దస్తగిరిని సీబీఐ పిలిచినట్లు సమాచారం.పులివెందులకు చెందిన  చెప్పుల దుకాణ యజమాని మున్నాతో పాటు మరో ఇద్దరిని ప్రశ్నించారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్‌లో సీబీఐ అధికారులు గత నెల 20న మొదటిసారిగా మున్నాను ప్రశ్నించారు. అనంతరం  ఆయన బ్యాంకు ల్యాంకరులో భారీ మొత్తంలో ఉన్న నగదు గుర్తించిన సీబీఐ అధికారులు.. గత మూడు రోజులు క్రితం మున్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో మున్నా నుంచి కీలక  సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది.కడపకు చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు, పులివెందులకు చెందిన బాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టారు. ఈ  ఇద్దరు మహిళలలో మున్నా రెండో భార్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళలతో పాటు మున్నా చెప్పుల షాప్‌లో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారణకు పిలిచి  ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు పులివెందులకు చెందిన చెప్పుల వ్యాపారి మున్నా నుంచి వివరాలు ఆరా తీశారు. వివేకా ఇంట్లో పనిచేసి రాజశేఖర్‌ను ప్రశ్నించారు  

Related Posts