YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ ఇవోగా జవహర్ రెడ్డి

టీటీడీ ఇవోగా జవహర్ రెడ్డి

విజయవాడ, అక్టోబరు 1
టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను బుధవారం ప్రభుత్వం బదిలీ చేసింది. మూడేళ్లకు పైగా ఈవో పదవిలో ఉన్న ఆయన్ను.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.  అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.టీటీడీ ఈవో బదిలీ వ్యవహారం మలుపు తిరిగింది. కొత్త ఈవోగా ప్రస్తుతం ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి నియమితులైనట్లు తెలుస్తోంది.. ఈ నెల 9న ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఏవీ ధర్మారెడ్డికి వారం పాటూ  ఈవోగా బాధ్యతలు అప్పగించారు. ముందు ధర్మారెడ్డిని ఈవోగా నియమించారని తెలిసింది.. కానీ జవహర్ రెడ్డికి ప్రభుత్వం ఆ బాధ్యతలు అప్పగించింది.టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను  బుధవారం ప్రభుత్వం బదిలీ చేసింది. మూడేళ్లకు పైగా ఈవో పదవిలో ఉన్న ఆయన్ను.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను వైద్య  ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఈవో పదవి నుంచి రిలీవ్ కానున్నారు. 1993 బ్యాచ్‌‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్  సింఘాల్‌ను 2017 మే నెలలో టీటీడీ ఈవోగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ను టీటీడీ ఈవోగా నియమించింది. సింఘాల్  రెండేళ్ల పదవీకాలం 2019లో ముగిసింది. కానీ, వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఈవోగా కొనసాగిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది.సింఘాల్‌ను బాధ్యతల నుంచి తక్షణం రిలీవ్ చేస్తారు. అయితే ధర్మారెడ్డి  ఈవో అవడానికి సరిపడా క్యాడర్ లేదు. ఆయన ఐఏఎస్ కాదు. అదే సమయంలో జవహర్ రెడ్డి కూడా తనను టీటీడీ ఈవోగా నియమించాలని కోరుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్  ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. అంటే టీటీడీకి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, ఈవోగా జవహర్ రెడ్డి, అదనపు ఈవోగా ధర్మారెడ్డి ఉంటారన్నమాట. వాస్తవానికి అనిల్ కుమార్ పదవీ కాలాన్ని  జూలైలోనే పొడిగించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితులైన కీలక అధికారుల్ని… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే.. తప్పించేసినా.. అనిల్ కుమార్ సింఘాల్ జోలికి మాత్రం వెళ్లలేదు.  టీడీపీ హయాంలో .. టీటీడీపై వైసీపీ చేసిన రాజకీయంగా.. అనిల్ కుమార్ సింఘాల్‌పైనా వైసీపీ అగ్రనేతలు ఆరోపణలు చేశారు. వైసీపీ ముఖ్యనేతలపై.. టీటీడీ ఈవో హోదాలో.. రూ. వంద కోట్లకు  పరువు నష్టం కేసులు కూడా వేయించారు. దీంతో సింఘాల్‌పై వైసీపీ నేతలకు పీకల దాకా కోపం ఉంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న సింఘాల్‌ను 2017 మేలో  చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. చంద్రబాబు సింఘాల్‌ను నియమించే సమయంలో తెలుగు వారికే టీటీడీ పోస్టు ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే పై స్థాయి నుంచి  సింఘాల్‌కు సపోర్ట్ ఉండటంతో చంద్రబాబు ఓకే చేశారు. మామూలుగా టీటీడీ ఈవో పదవీ కాలం రెండేళ్లే. అది ముగిసిన తర్వాత ప్రభుత్వంతో సంబంధం లేకుండా పొడిగింపు తెచ్చుకున్నారు. కానీ  పొడిగింపు ఇచ్చిన రెండు నెలలకే ప్రస్తుత ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. టీటీడీ ఈవో పోస్టుకు.. ఐఏఎస్ వర్గాల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ తర్వాత ఎవరైనా ప్రధానంగా టీటీడీ  ఈవోనే పోస్టునే కోరుకుంటారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి జవహర్ రెడ్డి లాంటి అధికారులు.. ఆ స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నించి సక్సెస్ అవుతున్నారు.  

Related Posts