YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు

అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు

విజ‌య‌వాడ‌, అక్టోబ‌రు 2, 
జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర మాత్రమే అయింది. కానీ అప్పుడే పూర్తిగా ఫెయిల్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం విమర్శలు చేస్తున్నారు. తాను ఉండగా నెంబర్ 1 గా ఉండే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ఇప్పుడు వెనకబడిపోయిందంటున్నారు. జమిలి ఎన్నికలు వస్తే ఈ ప్రభుత్వం బండారం బయటపడుతుందని చంద్రబాబు అంటున్నారు. అంటే జమిలి ఎన్నికలు వస్తాయన్న ఆశతో ఇంకా చంద్రబాబు ఉన్నారని అర్థమవుతోందికేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు పెట్టాలని తొలుత భావించింది. ఈ మేరకు కసరత్తులు కూడా చేసింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ జమిలి ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందా? అన్నదే ప్రశ్న. ప్రస్తుతం కరోనా దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. రాష్ట్రాలు కూడా పూర్తిగా ఆర్థికనష్టాల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలు జమిలి ఎన్నికలకు అంగీకరించే పరిస్థితి లేదన్నది వాస్తవం. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అంత త్వరగా జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.అయితే పదిహేను నెలల జగన్ పాలనను చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. నిత్యం జరిగే సంఘటనలపై కూడా ఆయన తీవ్రం గా స్పందిస్తుండటం చంద్రబాబులోని ఫ్రస్టేషన్ కు అద్దంపడుతుంది. రాష్ట్రం మొత్తం అప్పులమయం చేశారని, భవిష్యత్ లో ఏపీ కోలుకోలేదని కూడా చంద్రబాబు చెబుతున్నారు. అంతేకాదు ఇక రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి రైతుల భూములు ఇచ్చేందుకు ముందుకు రారని, అమరావతి రైతుల కు చేసిన మోసం ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తం రైతాంగంపై పడిందని శాపనార్థాలు పెడుతున్నారు.అదే కనుక తాను ముఖ్యమంత్రిగా ఉంటే ఎటువంటి విపత్తులనైనా అడ్డుకోగలనంటున్నారు. కరోనాను కూడా పూర్తిగా తాను నియంత్రించగలిగేవాడినని చెబుతున్నారు. జగన్ కు పాలన చేతకాదని, అభివృద్ధి జరిగితేనే సంపద సృష్టి సాధ్యమవుతుందన్నారు. జగన్ కు ఆ విజన్ లేదని, అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని చూస్తున్నాడని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అర్జంట్ గా జగన్ సీఎం కుర్చీ దిగిపోతే తాను ఎక్కాలన్న బాబు ఆరాటం ప్రతి కామెంట్ లోనూ కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు ఆశలన్నీ జమిలీ ఎన్నికలపైనే. మరి అది సాధ్యమవుతుందా? బాబు కల నెరవేరుతుందా? అన్నది చూడాలి.

Related Posts