YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్ర‌భుత్వాల పంతం... ప్రైవేట్ ట్రావెల్స్ కు కాసులు

ప్ర‌భుత్వాల పంతం... ప్రైవేట్ ట్రావెల్స్ కు కాసులు

హైద్రాబాద్, అక్టోబ‌రు 2,
ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ప్రయాణాలు కాస్త ఎక్కువ అవుతూ ఉన్నాయి. బస్సు సర్వీసులు తక్కువగా ఉండడంతో టికెట్ ధర కాస్త ఎక్కువగానే ఉంటోంది..! పరిస్థితులు అలాంటివి కాబట్టి అడిగినంత ఇచ్చేస్తూ ఉన్నారు కొందరు. కానీ ప్రయాణాలు చాలా కాస్ట్లీ అని మిడిల్ క్లాస్ జనాలు భావిస్తూ ఉన్నారు. ఏ పండగల సీజన్ లోనో ఉన్నట్లు.. ఇప్పుడు రేట్లు ఉన్నాయట..!
ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గింది.. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఈ విషయాన్ని క్యాచ్ చేసుకోవాలని భావిస్తోంది. సర్వీసుల్ని భారీగా పెంచేయాలని నిర్ణయం తీసుకోగా.. పెరుగుతున్న సర్వీసులతో పాటూ.. ధరలు కూడా భారీగా పెంచబోతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు బస్సుల్లో ఒక్కో టికెట్ మీద రూ.200 నుంచి రూ.400 వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా చోటు చేసుకున్న నష్టంతో పాటు.. శానిటైజేషన్ తదితరాలకు అయ్యే ఖర్చు కారణంగా టికెట్ రేట్లను పెంచబోతున్నామని చెబుతున్నారు. కాబట్టి ఏపీ టూ తెలంగాణ ప్రయాణం యమా కాస్ట్ లీ అయ్యే అవకాశం ఉంది.  ఇక నామ మాత్రంగా ఉన్న బస్సు ప్రయాణాలు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు కట్టిన ట్యాక్స్ లు కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి.  అక్టోబరు నుంచి డిసెంబరు మూడు నెలల కాలానికి సంబంధించి ప్రైవేటు ట్రావెల్స్ పెద్ద ఎత్తున పన్ను కట్టేశారు. ఏపీ - తెలంగాణ మధ్య ప్రైవేటు బస్సు సర్వీసులు భారీ ఎత్తున పెరగనున్నట్లుగా చెబుతున్నారు.  ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం 300 బస్సులు తిరుగుతుంటే.. ఈ నెల నుంచి 800లకు పైగా బస్సులు తిరగనున్నాయి. దసరా, దీపావళి, క్రిస్ మస్ నేపథ్యంలో పండుగ రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు రవాణా శాఖకు పన్ను చెల్లింపుల్ని పూర్తి చేశాయి  ప్రైవేటు ట్రావెల్స్. దీంతో ఇక నుండైనా ఇన్ని రోజులూ నష్టపోయిన ఆదాయాన్ని సంపాదించుకోవాలని అనుకుంటూ ఉన్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు.

Related Posts