YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గ్రేట‌ర్ లో క‌మ‌లం, జ‌న‌సేన క‌లిసి పోటీ

గ్రేట‌ర్ లో క‌మ‌లం, జ‌న‌సేన క‌లిసి పోటీ

హైద్రాబాద్, అక్టోబ‌ర్ 2, 
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపేందుకు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నుంచి ఒక్క రాజాసింగ్ మాత్రమే గెలిచారు. రాష్ఠ్రంలోనూ, నగరంలోనూ ఆ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడం లోటుగా కన్పిస్తుంది. ఎంపీలు మాత్రం నలుగున్నారు. నగరానికి చెందిన ఎంపీ కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక నగరంలో ఎమ్మెల్యేలు లేని లోటును భర్తీ చేసుకునేందుకు బండి సంజయ్ కొత్త వ్యూహాన్ని రచించారు.గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కూడా కసరత్తు ప్రారంభించింది. ఈ సమయంలో హైదరాబాద్ నగరంలో పాగా వేయాలన్నది బండి సంజయ్ ఆలోచనగా ఉంది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి అధిష్టానానికి తాను ఏంటో చెప్పాలనుకుంటున్నారు. అందుకోసం బండి సంజయ్ పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో పాటు అందరి నేతలను సమన్వయం చేసుకుని వెళ్లే పనిలో పడ్డారు.దీంతో పాటు హైదరాబాద్ ఎన్నికల్లో తమ మిత్రపక్షమైన జనసేనను కూడా కలుపుకుని పోవాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. జనసేన కు కొన్ని వార్డుల్లో టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఫలితంగా పవన్ కల్యాణ‌్ ప్రచారాన్ని కూడా హైదరాబాద్ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని బండి సంజయ్ భావిస్తున్నారు. ఈమేరకు త్వరలోనే పవన్ కల్యాణ‌్ తో సమావేశమై గ్రేటర్ ఎన్నికలపై చర్చించాలని బండి సంజయ్ భావిస్తున్నారు. అయితే పొత్తుతో పోటీకి పవన్ అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ ప్రచారానికి సమయం ఇస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంటుంది.నగరంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కొత్త ఎత్తుగడతో ముందుకెళుతున్నారు బండి సంజయ్. హైదరాబాద్ నగరాన్ని ఆరు జిల్లాలుగా విభజించారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్క అధ్యక్షుడిని నియమించారు. వీరు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. సంరెడ్డి సురేంద్రెడ్డి, పాండు యాదవ్, శ్యాంసుదర్ గౌడ్, గౌతంరావు, పన్నాల హరీశ్ రెడ్డి, సామ రంగారెడ్డిలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. వీరంతా వార్డుల వారీగా తిరిగి కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి అభ్యర్థుల జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. నగర ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొంటే పార్టీకే కాకుండా ఫలితాలపై కూడా ప్రభావం ఉంటుందని బండి సంజయ్ అభిప్రాయపడుతున్నారు. మరి బండి సంజయ్ వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది.

Related Posts