రాజమండ్రి అక్టోబర్ 2,
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నదాత వెన్ను విరిచేలా మూడు రైతు వ్యతిరేక బిల్లులు ప్రవేశపెట్టి,మూజువాణి ఓటుతో ఆమోదింప చేసుకోవడాన్ని నిరసిస్తూ జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు అధ్యక్షుడు ఎన్. వి . శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు . జాంపేట నుంచి దేవీ చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు, రైతాంగానికి, వ్యవసాయానికి, వినియోగదారులకు వ్యతిరేకమైన ఈ బిల్లులని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎన్వి శ్రీనివాస్ డిమాండ్ చేశారు . ఈ బిల్లులకు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే,కేంద్ర ప్రభుత్వ మిత్రపక్షమైన అకాలీదళ్ పార్టీ తమ మంత్రి పదవికి రాజీనామా చేస్తే, మన రాష్ట్రంలోని అధికార పక్షమైన వైసీపీ, ప్రతిపక్షమైన టిడిపి మద్దతు తెలపటం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు గోలి రవి ,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పి రవీంద్ర శ్రీనివాస్ , జిల్లా లేబర్ సెల్ చైర్మన్ లోడ అప్పారావు , ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు మట్టా శివకుమార్ గౌడ్, నగర అధ్యక్షులు దాసరి ప్రసాద్, బ్లాక్ వన్ కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లా సుబ్బారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నలబాటి శ్యామ్ పుల్లేటికుర్తి జగన్నాథ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు .