YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నవరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

నవరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

తిరుమల అక్టోబ‌ర్ 2, 
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం జిల్లా యంత్రాంగం, పోలీసుల సమన్వయంతో టిటిడిలోని వివిధ విభాగాలు చేపట్టాల్సిన ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జిల్లా కలెక్టర్  భరత్ నారాయణ గుప్తాతో కలిసి ఈ సమీక్ష చేపట్టారు.పరిమితంగా భక్తులతో నాలుగు మాడ వీధుల్లో స్వామివారి వాహనసేవల ఊరేగింపు ఉంటుంది. గరుడ సేవతో పాటు అన్ని వాహనసేవలకు దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతిస్తారు.ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు ఉంటాయి.బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన అక్టోబరు 21న సాయంత్రం పుష్పక విమానసేవ, అక్టోబరు 23న స్వర్ణరథం ఊరేగింపు ఉంటాయి.అక్టోబరు 24న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.గ్యాలరీల్లో థర్మల్ స్క్రీనింగ్తోపాటు ఫుట్ ఆపరేటెడ్ శానిటైజర్లు ఏర్పాటు.భక్తులందరికీ అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పరిమిత సంఖ్యలో కళాబృందాలతో వాహనసేవల ముందు ప్రదర్శనలు కూడా నిర్వహించన్నారు.

Related Posts