YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీసీల గొంతుకగా గౌతు రాజకీయ పోరాటం

బీసీల గొంతుకగా గౌతు రాజకీయ పోరాటం

శ్రీకాకుళం, అక్టోబ‌రు 3,
శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన కుటుంబాల్లో గౌతు వారిది ఒకటి ఉంది. బీసీ సామాజికవర్గానికి చెందిన గౌతు ఫ్యామిలీ రాజకీయంగా ఎపుడూ నానుతూనే ఉంటుంది. దానికి కారణం గౌతు లచ్చన్న. ఆయన నిలువెత్తు బీసీల గొంతుకగా సుదీర్ఘ రాజకీయ పోరాటం చేశారు. ఆయన వారసుడిగా కుమారుడు శ్యామ సుందర శివాజీ రంగప్రవేశం చేసినా తండ్రి మాదిరిగా ధాటీగా రాజకీయం చేయలేకపోయారు. దివంగత ఎర్రన్నాయుడుతో కలసి జంట ఎమ్మెల్యేలుగా సిక్కోలు రాజకీయాన వెలిగినా కూడా పేరు అంతా ఎర్రన్నాయుడుకే దక్కింది. వ్యూహాలు వేసి లక్ష్యాన్ని చేరడంలో ఎపుడూ ఎర్రన్నాయుడే ముందుండేవారు.ఇక గౌతు శ్యామసుందర శివాజీ మాత్రం కొన్ని సార్లు చంద్రబాబుని నమ్మి, మరికొన్ని సార్లు నమ్మక ఎర్రన్నాయుడుతో జట్టు కట్టి చివరకు జిల్లాలో సీనియర్ మోస్ట్ గా ఉన్నా కూడా జిల్లాలో ఎటూ కాకుండా పోయారు. చంద్రబాబు ఆయనకు ఒకసారి మంత్రి పదవి ఇచ్చారు కానీ ఆయన అనుకున్న శిఖరాలను మాత్రం చేరలేకపోయారు. ఇక 2017లో జరిగిన మంత్రివర్గ విస్తరణ తరువాత శివాజీ ఏకంగా కంటతడి పెట్టారు. తనకు మంత్రి పదవి రాలేదు, ఇక రాబోదు అని కూడా డిసైడ్ అయి ఆయన ఎమోషన్ అయ్యారనుకోవాలి. దానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో తాను తప్పుకుని పలాసలో కుమార్తె గౌతు శిరీషకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఆమె పరాజయం పాలు అయ్యారు. ఇపుడు ఈ కుటుంబానికి మిగిలింది ఒకే ఒక్క చాన్స్ అదే 2024 ఎన్నికలు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక పలాసలో గౌతు కుటుంబానికి పూర్తిగా చెక్ పెట్టాలనే తొలిసారి గెలిచిన సీదరి అప్పలరాజుని జగన్ మంత్రి గా చేశారు. యువకుడు, డాక్టర్, పైగా మత్య్స కార సామాజికవర్గానికి చెందిన అప్పలరాజు దూకుడు రాజకీయమే చేస్తున్నారు. ఆయన తన పదవీకాలంలో భావ‌నపాడు పోర్టు మొదటి దశను కనుక నిర్మించేలా చూస్తే చాలు పలాసాలో పది కాలాల రాజకీయం ఆయన సొంతం అవుతుంది. అదే విధంగా లోకల్ గా మంత్రిగా ఉన్న ఆయన మరింత గట్టిగా పట్టుని సాధిస్తున్నారు. గౌతు శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి వల్ల ఇబ్బంది పడిన వర్గాలన్నీ కూడా ఇపుడు మంత్రి వెంట ఉన్నాయి. శివాజీ మంచితనం ఎంతలా ఉన్నా కూతురూ అల్లుడూ చేసిన అరాచక రాజకీయాల మూలంగా గౌతు కుటుంబానికి పలాసలో పొలిటికల్ ధిలాసా ఏమీ కనిపించడంలేదు.మరో ఆరోపణ ఏంటి అంటే శివాజీ, శిరీషా కుటుంబాలు పూర్తిగా విశాఖలో ఉంటూ సిక్కోలు రాజకీయం అక్కడ నుంచి చేస్తారు అని. టీడీపీ తమ్ముళ్లకు కూడా దాని మీద అసంత్రుప్తి ఉంది. శిరీషను జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా చేసినా కూడా పార్టీని ఆమె కేవలం ప్రెస్ నోట్లు, ప్రకటనల ద్వారానే నడుపుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా హఠాత్తుగా తండ్రీ కూతుళ్ళు ఇద్దరూ పలాసాలో ఏదో జరిగిపోతోందని, వైసీపీ ఏలుబడిలో అసలు అభివృద్ధి లేదని అంటూ మీడియా ముందుకు వచ్చారు. పలాసలో కరవు పరిస్థితులు ఉన్నాయని కూడా గగ్గోలు పెట్టారు. సాగు నీరు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వైసీపీ సర్కార్ ఉందని కూడా ఆరోపించారు. ప్రభుత్వం అసమర్ధంగా వ్యవహరిస్తోందని కూడా హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈ విమర్శలు ఎంతవరకూ జనంలో పనిచేస్తాయో తెలియడంలేదు. పలాసలో ఇప్పటికే టీడీపీ ప్రాభవం తగ్గుతోంది. గౌతు కుటుంబానికి ఉన్న ఆదరణ అంతా లచ్చన్న నుంచి శివాజీ వరకూ బదిలీ అయి అక్కడితో ఫుల్ స్టాప్ పడిందని అంటున్నారు. ఇపుడు మూడవ తరం రాజకీయం గౌతు కుటుంబంలో నడవడం అంటే కత్తి మీద సామేనని విశ్లేషణలు ఉన్నాయి.

Related Posts