YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్లకు డిమాండ్

ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్లకు డిమాండ్

న్యూఢిల్లీ, అక్టోబ‌రు 3, 
కరోనా సంక్షోభంతో దేశంలో వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ పెరిగిన విషయం తెలిసిందే.  దీంతో అప్పటి వరకు ఆఫీసులలోని ఫెసిలిటీస్ను వాడుకొని పనిచేసే ఉద్యోగులు, తమ ఇళ్లల్లోనే అటువంటి ఫెసిలిటీస్ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. చిన్న పట్టణాలలో కూడా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్లకు డిమాండ్ పెరిగిందని డేటా చెబుతోంది. వై–ఫై ఎక్సెండర్లు, ల్యాప్టాప్లు, పీసీలు, స్మార్ట్ఫోన్లకు లాక్డౌన్ టైమ్ నుంచి చూస్తే మంచి డిమాండ్ కనిపిస్తోంది. వీటితో పాటు థర్మోమీటర్లు, ఆక్సిమీటర్లు, బీపీ మానిటర్ల వంటి హెల్త్ కేర్  గ్యాడ్జెట్లకు కూడా డిమాండ్ పుంజుకుంది. వై–ఫైను మెరుగుపరిచే ప్రొడక్ట్లను అమ్మే ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ హోం ఆఫీస్ ఈ ఏడాది ఏప్రిల్లో లాంచ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ రూ. రెండు కోట్ల విలువైన ప్రొడక్ట్లను అమ్మగలిగింది. నెలవారీగా చూస్తే గత మూడు నెలల్లో కంపెనీ వై–ఫై ప్రొడక్ట్ల గ్రోత్ 50 శాతంగా ఉందని హోం ఆఫీస్ చెబుతోంది. హెడ్ ఫోన్స్ సెగ్మెంట్ 25 శాతం, వెబ్ క్యామ్స్ సెగ్మెంట్ 20 శాతం పెరిగిందని పేర్కొంది. తమ ప్లాట్ఫామ్లో ఇంటెల్, రెసోనేట్ బ్రాండ్లకు చెందిన వై–ఫై ఎక్సెండర్ల ఆర్డర్లు  పెరిగాయని హోం ఆఫీస్ ఫౌండర్ శ్రీకాంత్ ఆచార్య అన్నారు. వీటితో పాటు జేబీఎల్ వంటి బ్రాండ్లకు చెందిన నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్ల అమ్మకాలు పెరిగాయని చెప్పారు. లాక్డౌన్లో కంపెనీ వై–ఫై రూటర్ యూపీఎస్ అమ్మకాలు పెరిగాయని స్టార్టప్ కంపెనీ రెసోనేట్ తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోం చేసేటప్పుడు పవర్ బ్యాకప్ ఉండడం అవసరం కాబట్టి ఈ ప్రొడక్ట్ల అమ్మకాలు పెరిగాయని పేర్కొంది. వీటికి తోడు టెలికాం ప్రొడక్ట్లఅమ్మకాలు పుంజుకోవడానికి కారణమని తెలిపింది.ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్లకు డిమాండ్ పెరగడంతో ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు కూడా భారీగా లాభపడ్డాయి.  ఫోన్ యాక్సెసరీస్, స్టడీ ఫ్రమ్ హోం మెటీరియల్స్, స్మార్ట్ డివైజ్లు, కిచెన్, హోం అప్లియెన్సెస్కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని అమెజాన్ చెబుతోంది. వీటితో పాటు ల్యాప్టాప్లు, ట్రిమ్మర్స్ వంటి పర్సనల్ గ్రూమింగ్  ప్రొడక్ట్ల కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది

Related Posts