విశాఖపట్నం అక్టోబరు 4,
గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎం జగన్ కు అభినందనలు తెలిపిన రాష్ట్ర సి ఈ సి సభ్యులు పైలా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్య ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని పైలా కొనియాడారు. అలాగే ప్రభుత్వం అందించే అభి వృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి అందించాలని,ప్రతి పేదవాది మొహంలో చిరునవ్వుచూడాలనే ఏకైక లక్ష్యంతో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ, వాలంటరీ వ్యవస్థ ద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించి న ఏకైక సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని పైలా శ్రీనివాస్ రావు కొనియాడారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ ఏటువంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్లే బృహత్తరద వ్యవస్థను ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించారని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 543 రకాలసేవలు అందుతున్నాయని ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం సచివాలయ వ్యవస్థ పనితీరును అభినందించారని అన్నారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికివాలంటీర్లకు అభినందనలు తెలుపుతూ అవినీతిరహిత పరిపాలన అందించినందుకు ఇంతటి గొప్ప వ్యవస్థకు రూపకల్పన చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర సి ఈ సి సభ్యులు పైలా శ్రీనివాస్ రావు కృతజ్ఞతలు తెలిపారు.