YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దేశ జనాభా గణనలో కులాల వారు లెక్కలు తీయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఆర్ కృష్ణయ్య

దేశ జనాభా గణనలో కులాల వారు లెక్కలు తీయాలి     కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్ అక్టోబర్ 4,
2021లో కేంద్ర  ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే దేశ జనాభా గణనలో కులాల వారు లెక్కలు తీయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో నేడు  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో చర్చలు జరిపారు. ఈ చర్చలలో సంఘ నేతలు జిల్లపల్లి అంజి, మాడిశెట్టి సురేందర్, ఉదయ్, యం.మహేందర్ గౌడ్, జస్వంత్ గౌడ్, తదితరులు  పాల్గొన్నారు. బీసీ జనాభా లెక్కల వివరాలు సేకరించవలసిన ఆవశ్యకత ప్రభుత్వాలకే ఉంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాల అభివృద్ధికి విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు - ఆర్థిక,  రాజకీయ రంగాలలో అభివృద్ధికై అనేక స్కీములు అమలు జరుపుతున్నారు. బడ్జెట్టు కేటాయిస్తున్నారు. అలాగే రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల  కేటాయింపు - పంచాయితీరాజ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీసీ జనాభా లెక్కల వివరాలు అవసరం పడుతున్నాయి. మనదేశంలో బి.సి కులాల జనాభా లెక్కల వివరాలు  లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిరయించడంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. జనాభా లెక్కలు లేనందున సుప్రీంకోర్టు – హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని  నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. ఏయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లను బీసీలకు కేటాయించాలి, ఎంత శాతం కేటాయించాలని విషయంలో బీసీ జనాభా లెక్కలు లేక  న్యాయపరమైన చట్టపరమైన కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా కూడా బీసీ జనాభా లెక్కలు లేక అనేక సమస్యలు  ఎదురవుతున్నాయి .  గ్రామీణాభివృద్ధి పథకాలకు, ఇళ్ళ పథకాలకు స్వయం ఉపాది పథకాలకు బడ్జెట్ కేటాయింపులు బి.సి  జనాభా లెక్కలు లేకపోవడంతో ప్రభుత్వామే ఇబ్బందులు  ఎదుర్కొంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేంద్ర బి.సి రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి ని చైర్మన్ కమిటీ చేశారు. కుల వారి జనాభా లెక్కలు లేకపోవడంతో ఈ కమిటీ  వర్గీకరణ చేసి ఏయే గ్రూపుకు ఎంత శాతం నిర్ణయించాలో తెలియక తిక-మక పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటుంది.గతంలో 2010లో అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం  అధికారంలో ఉండగా బి.జె.పి పార్టీ పరంగా బీసీ జనాభా కులాల వారిగా లెక్కలు తీయాలని పార్లమెంటులో డిమాండ్ చేసింది. బి.జె.పి కొరినందుకే అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కులాల  వారీ లెక్కలు తీయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీ.జే.పీ అధికారంలో ఉంది. కావున కులాలు వారి లెక్కలు తీయవలసిన భాద్యత అవసరం-ఆవశ్యకత ఉంది. సమయం  మించిపోలేదు,  పైగా దీనికి ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదు. ఒక రూపాయి ఖర్చు లేకుండా జనాభా లెక్కలు వస్తాయి.01.08.2018 నాడు అప్పటి హోంశాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ తో  జరిపిన హోంశాఖ ఉన్నత స్థాయి సమావేశంలో జనాభా గణనలో బి.సి కులాల వారి లెక్కలు తీయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్నారు. రెండవ సారి అధికారంలోకి రాగానే  ఎందుకు మార్పు వచ్చింది.లాల వారిగా జనాభా లెక్కలు తీయాలని సుప్రీంకోర్టు మండల కేసు సందర్భంగా తీర్పు చెప్పింది. రిజర్వేషన్ల కేసులో హైకోర్టు - సుప్రీంకోర్టు లో వచ్చిన ప్రతి  సందర్భంలో కులాల వారిగా జనాభా లెక్కలు తీయాలని కోర్టులు తీర్పులు చెప్పాయి.రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన మండల్ కమిషన్, కాకా కాలేల్కర్, రాష్ట్ర స్థాయిలో  నియమించిన 242 బీసీ కమిషన్ లు జనాభా గణనలో కులాల వారు లెక్కలు తీయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కులాల వారు లెక్కలు తీస్తామని గత  పది సంవత్సరాలుగా అంగీకరిస్తూనే ఆచరణలో మొండిచేయి చూపుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.  

Related Posts