YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ మామ గంగిరెడ్డి కన్నుమూత, భావోద్వేగం

జగన్ మామ గంగిరెడ్డి కన్నుమూత, భావోద్వేగం

కడప, అక్టోబరు 4,
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.  కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌ ద్వారా నేరుగా పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మామ కడసారి చూసి భావోద్వేగం చెందారు మామ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈసీ గంగిరెడ్డి పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, గౌతమ్‌రెడ్డి తదితరులు నివాళర్పించారు.మామకు నివాళులర్పిస్తున్న సీఎం జగన్ గా, సీఎం జగన్ సతీమణి వైఎస్ జగన్ భారతి తండ్రి అయిన ఈసీ గంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి గంగిరెడ్డి కన్నుమూశారు.
ఈసీ గంగిరెడ్డి పులివెందులలో పేరుప్రతిష్టలు కలిగిన ప్రముఖ వైద్యుడు. పేదల డాక్టర్‌గా ఆయన మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. తమ అభిమాన డాక్టర్‌ను కడసారి చూసేందుకు గంగిరెడ్డి అభిమానులు, అనుచరులు, బంధువులు పెద్దఎత్తున తరలివచ్చారు. మరోవైపు, ఈసీ గంగిరెడ్డి మృతిపట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. వైద్యులుగా ఆయన ఎనలేని సేవలు అందించారని గవర్నర్ కొనియాడారు.

Related Posts