YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

శౌర్య అణు‌ క్షిప‌ణి ప‌రీక్ష విజ‌య‌వంతం

శౌర్య అణు‌ క్షిప‌ణి ప‌రీక్ష విజ‌య‌వంతం

భువనేశ్వర్ అక్టోబర్ 4,
మ‌రో అణు సామ‌ర్ధ్య క్షిప‌ణిని భార‌త్ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. కొత్త‌గా అభివృద్ధిచేసిన శౌర్య న్యూక్లియ‌ర్ బాలిస్టిక్ క్షిప‌ణిని ఒడిశాలోని బాలాసోర్ తీరంలో విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. భూత‌లం నుంచి భూత‌లంపైకి ప్ర‌యోగించే ఈ క్షిప‌ణికి 800 కి.మీ. దూరంలోని ఉన్న ల‌క్ష్యాల‌ను ఛేదించే సామ‌ర్థ్యం ఉన్న‌ద‌ని డీఆర్‌డీవో వెల్ల‌డించింది. శౌర్య క్షిప‌ణితో ప్ర‌స్తుతం ఉన్న క్షిప‌ణి వ్య‌వ‌స్థకు మ‌రింత బ‌లం చేకూరుతుంద‌ని అధికారులు తెలిపారు. ఈ క్షిప‌ని చాలా తేలికైనద‌ని, దీన్ని సులువుగా ప‌రీక్షంచ‌వ‌చ్చ‌ని చెప్పారు. బ్ర‌హ్మోస్ సూప‌ర్ సోనిక్ క్షిప‌ణిని డీఆర్‌డీవో బుధ‌వారం విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ రేంజ్ నుంచి ఈ ప్ర‌యోగం నిర్వ‌హించారు. ఈ క్షిప‌ణి 400 కిలోమీట‌ర్ల దూరంలోని ల‌క్ష్యాల‌ను విజ‌య‌వంతంగా చేధించ‌గ‌ల సామర్థ్యం క‌లిగి ఉన్న‌ది. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీవో) చేప‌ట్టిన పీజే-10 ప్రాజెక్టు కింద ఈ ప‌రీక్ష చేపట్టారు. దేశీయంగా రూపొందిందిన బూస్ట‌ర్‌తో ఈ బ్ర‌హ్మోస్ క్షిప‌ణిని లాంచ్ చేశారు.

Related Posts