YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వినుకొండ‌లో హీటెక్కుతున్న రాజ‌కీయాలు

వినుకొండ‌లో  హీటెక్కుతున్న రాజ‌కీయాలు

గుంటూరు, అక్టోబ‌రు 5, 
వినుకొండలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఫైట్ మామూలుగా లేదు. ఒకే సామాజికవర్గం నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వినుకొండ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మైండ్ గేమ్ ప్రారంభించారు. జీవీ తన సామాజికవర్గం నేతలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. అందుకు బొల్లా బ్రహ్మనాయుడుపై పొలిటికల్ గేమ్ ను మొదలెట్టారు.జీవీ ఆంజనేయులు వినుకొండ ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించారు. జీవీ హ్యాట్రిక్ విజయాలను బొల్లా బ్రహ్మనాయుడు గండి కొట్టారు. ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కమ్మ సామాజికవర్గంపై కక్ష తీర్చుకుంటుందన్న వ్యవహారాన్ని జీవీ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. అందుకే ఆయన బొల్లా బ్రహ్మనాయుడిపై మైండ్ గేమ్ ను ప్రారంభించారని తెలుస్తోంది.ఎన్నికల సమయంలో బొల్లా బ్రహ్మనాయుడు కమ్మ సామాజికవర్గం వారికి చేసిన ప్రామిస్ ను జీవీ ఆంజనేయులు ఇప్పుడు వెలుగులోకి తెచ్చారు. తాను వైసీపీ నుంచి గెలిచినా టీడీపీలోకి వస్తానని బొల్లా బ్రహ్మనాయుడు కమ్మ సామాజికవర్గానికి చెప్పి ఓట్లను తెచ్చుకున్నారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. అంతేకాదు టీడీపీ ప్రభుత్వం హయాంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కాంటాక్టు పనులు చేశారు. ఆ బిల్లులను కూడా బొల్లా బ్రహ్మనాయుడు తొక్కి పెట్టారని జీవీ ఆంజనేయులు ఆరోపిస్తున్నారు.దీనికి బొల్లా బ్రహ్మనాయుడు తాను ఎటువంటి ప్రామిస్ చేయలేదని అంటున్నారు. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీకి ఎలా వస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. జీవీ ఆంజనేయులు రేషన్ బియ్యాన్ని తరలించి ఏడు వేల కోట్లరూపాయలకు గండికొట్టారని బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపిస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య ఒక సామాజికవర్గాన్ని కాపాడుకునేందుకే మాటల యుద్ధం ప్రారంభమయిందనే అంటున్నారు. మొత్తం మీద వినుకొండ రాజకీయాల్లో కమ్మ సామాజికవర్గం కీలకంగా ఉండటంతో వారిని దరిచేర్చుకునే ప్రయత్నాలే ఇవి అన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Related Posts