YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొంప‌ముంచిన అమ‌రావ‌తి రాగాల‌పాన‌

కొంప‌ముంచిన అమ‌రావ‌తి  రాగాల‌పాన‌

విశాఖ‌ప‌ట్ట‌ణం, అక్టోబ‌రు 5, 
విశాఖ ఇపుడు ఏపీలోనే హాట్ టాపిక్ గా మారింది. విశాఖ రాజధాని మీదనే అతి పెద్ద యుద్ధం వైసీపీ, టీడీపీల మధ్యలో సాగుతోంది. విశాఖలోనే టీడీపీకి ఎమ్మెల్యేల బలం ఉంది. విశాఖ ఎపుడూ టీడీపీ గట్టి మద్దతు, అందుకే చంద్రబాబు చాలా డేరింగ్ గా అమరావతి మన ఏకైక రాజధాని అని బోల్డ్ స్టెప్ తీసుకున్నారు. విశాఖ వాసులకు రాజధాని ఎందుకూ అంటూ దీర్ఘాలు తీసారు. వారు ఎపుడూ కోరుకోలేదని కూడా గట్టిగా సమర్దించుకున్నారు. అయితే ఇపుడు అదే విశాఖ బాబుకు చుక్కలు చూపిస్తోంది. విశాఖ నాకు చాలా ఇష్టమన్న బాబుకు ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెడుతోంది.విశాఖలోని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ జగన్ బంపర్ మెజారిటీతో గెలుస్తాడు అంటూ గత ఏడాది జోస్యం చెప్పారు. అది అలాగే జరిగింది. ఇపుడు ఆ స్వామిని మించి తమ్ముళ్ళు టీడీపీ గురించి చంద్రబాబు గురించి జాతకాలు చెబుతున్నారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ బతికి బట్టకట్టడం కష్టమని అదే పార్టీలో ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కొద్ది రోజుల క్రితం ఆవేశంలో చాలా నిజాలే మాట్లాడేసారని టాక్. చంద్రబాబు జామ్ యాప్ ముందేసుకుని హైదరాబాద్ లో ఉంటే సైకిల్ కి రిపేర్లు తప్పవని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అది పాజిటివ్ గా తీసుకున్న వారికి ఒకలా సౌండ్ వినిపిస్తే నెగిటివ్ గా తీసుకున్న వారు మాత్రం అయ్యన్నే అని విషయాలూ చెప్పేశాడుగా, ఇక టీడీపీ సీన్ కాలిందని అంటున్నారు.ఇక టీడీపీని వీడిపోతున్న వారంతా కూడా ఆ పార్టీ మునిగే నావ అంటూనే వచ్చారు. మొన్న మాజీ ఎమ్మెల్యే రహమాన్ చెప్పినా, నిన్న పంచకర్ల రమేష్ బాబు అన్నా, ఇపుడు వాసుపల్లి గణేష్ కుమార్ గట్టిగా విమర్శలు చేస్తున్నా ఏపీలో టీడీపీ మరి ముందుకు సాగదు అన్నదే వారంతా కలసి చూసి చెప్పిన జాతకం ముచ్చట్లు. వీరే కాదు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున అనేకమంది టీడీపీ నేతలు పార్టీ మారారు. వారంతా కూడా ఇదే మాట అంటున్నారు. ఒకనాడు కంచుకోట విశాఖలో టీడీపీలో ఎన్నో గొంతులు గట్టిగా లేచేవి. ఇపుడు మాత్రం బలహీనమవుతున్నాయి. టీడీపీకి ఇంతే సంగతులు అని తమ్ముళ్ళు కూడా బాధతోనే అంటున్నారు.ఇక చంద్రబాబు ప్రతీసారి చెప్పిన మాటనే చెప్పుకుంటూ వస్తున్నారు. నాయకులు పోయినా పార్టీకి ఏం కాదని అంటున్నారు. తాను మరింతమందిని తయారుచేస్తానని కూడా చంద్రబాబు అంటున్నారు. వారిని వైసీపీ కొనేస్తోందని పాత మాటలే మాట్లాడుతున్నారు. అవన్నీ సరే కానీ కరడు కట్టిన టీడీపీ నాయకులు కూడా పార్టీని వీడివెళ్ళడాన్ని చూసి కూడా చంద్రబాబు ఇలా చెప్పడం పట్ల తమ్ముళ్ళే తప్పు పడుతున్నారు. పార్టీలో లోపాలు ఉండబట్టే నేతలు పోతున్నారు, వాసుపల్లి లాంటి వారు వెళ్ళారంటేనే చంద్రబాబు ఆలోచించాలని సూచిస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు ఏనాడూ పార్టీని పట్టించుకోని చంద్రబాబు విపక్షంలో ఉంటూ కూడా అమరావతి రాగాలాపన చేయడం వల్లనే విశాఖలో టీడీపీ పుట్టె మునిగిందని ఇపుడు తమ్ముళ్ళు అంటున్నారు. మొత్తానికి విశాఖ స్ట్రాంగ్ ప్లేస్. టీడీపీకి ఏం కాదు అని బయటకు అంటున్నా లోలోపల బాబు పరేషన్ అవుతున్నారని తాజా పరిణామాలే చెబుతున్నాయి. ఇక కొత్త వారికి చాన్స్ ఇస్తానని అంటున్నా చంద్రబాబు వయోభారాన్ని దృష్టిలో ఉంచుకుని అయ్యే పనేనా అని తమ్ముళ్ళే అనేస్తున్నారుట.

Related Posts