YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బిఎస్‌-3 వాహనాల రిజిస్ట్రేషన్‌లో అధికారుల ఉచ్చు

బిఎస్‌-3 వాహనాల రిజిస్ట్రేషన్‌లో అధికారుల ఉచ్చు

అనంతపురం, అక్టోబ‌రు 5, 
రాష్ట్రంలోనే సంచలన కేసుగా ఉన్న వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసు అటు రాజకీయంగానూ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అది కాస్త అధికారుల చుట్టు ఉచ్చుబిగుస్తోంది. బిఎస్‌-3 వాహనాలను బిఎస్‌-4 రిజిస్ట్రేషన్‌ నాగాలాండ్‌లో చేసి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌ చేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై రవాణా శాఖ లోతైన దర్యాప్తును ఇది వరకే చేపట్టిన విషయం తెలిసిందే. అశోక్‌ లైల్యాండ్‌కు సంబంధించిన 129 వాహనాలను తక్కుకింద కొనుగోలు చేసి నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసి, ఇక్కడికి బదిలీ చేసి అమ్మేశారు. ఈ వాహనాలను జఠాధర, గోపాల్‌ అండ్‌ కో కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్‌ జరిగాయి. ఎన్‌ఒసిపై ఇక్కడికి వచ్చిన సమయంలో ఇక్కడి అధికారులు సరైన పరిశీలన జరపకుండా రిజిస్ట్రేషన్‌ చేసారని రవాణా శాఖ ఉన్నతాధికారులు జరిపిన విచారణలో తేలింది. ఇందులో 17 మంది భాగస్వామ్యులైనట్టు వారిపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత బాధ్యులైన వారికి తాఖీదులిచ్చారు. 17 మందిలో రిటైర్డు ఎఒ ఒకరు ఉన్నారు. తక్కిన వారందరూ ఇప్పటికీ విధుల్లో ఉన్నారు. అందరిపైనా చర్యలకు రవాణా శాఖ కమిషనరు నుంచి ఆదేశాలొచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో ఆరుగురు ఇన్స్‌పెక్టరు, ఇద్దరు ఆర్టీవోలు, ఇద్దరు ఎఒవిఐలు, ఇద్దరు ఎఒలు కలిపి మొత్తం 17 మందిపై చర్యలకు ఆదేశాలిచ్చారు.బిఎస్‌-3 ట్రక్కుల వ్యవహారంపై ఇంకా విచారణ జరుగుతున్న క్రమంలోనే కొత్తగా కార్ల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహరం వెలుగులోకి వచ్చింది. టు టైర్‌, త్రీటైర్‌ రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత వాహనాలు ఇక్కడి నుంచి అమ్మేసిన తరువాత ఎన్‌ఒసిపై వెళ్లిన వాహన నంబర్లను గుర్తించి, కాగితపు ఆర్‌సిలను డూప్లికేట్‌గా తయారు చేసి మరోమారు కొత్త వాహనాలను అంటే అక్రమంగా వచ్చిన వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసి చట్టబద్ధత కల్పించే చర్యలకు పాల్పడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందులోనూ రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్టు రవాణా శాఖ ఉన్నతాధికారులు జరిపిన విచారణలో వెళడవుతోంది. ఇందులో ఎఒలు ఇతర అధికారుల పాత్ర వెలుగులోకి రావడంతో వారిపైనా చర్యలకు సిద్ధపడుతున్నారు. ఇప్పటి వరకు ఆరు వాహనాలు అక్రమ రిజిస్ట్రేషన్‌ జరిగినట్టు గుర్తించారు. ఇదే రకంగా మరికొన్ని జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. గడిచిన రెండుమూడేళ్లలో జరిగిన ఇటువంటి రిజిస్ట్రేషన్‌ల వ్యవహారంపై లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇందులో ఇంకెన్ని వాహనాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్‌లో సాగుతున్న అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుండం చర్చనీయాంశమే కాకుండా ఆ శాఖ ఉన్నతాధికారులను సైతం నివ్వెరపరుస్తున్నాయి.

Related Posts