YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ లో జెట్ స్పీడ్...

టీడీపీ లో జెట్ స్పీడ్...

గుంటూరు, అక్టోబ‌రు 5, 
చాన్నాళ్లూ పార్టీ పదవులను భర్తీ చేయకుండా ఉన్న చంద్రబాబు చివరకు ప్రకటించారు. అయితే దీనివల్ల కొంత పార్టీకి ఊపు వస్తుందని అంటున్నారు. కొత్తగా బాధ్యతలను చేపట్టిన వారు ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వీలుంది. అధిష్టానం కూడా వీరిని ప్రశ్నించే అవకాశముండటంతో ఇక పదమూడు జిల్లాల్లోనూ పార్టీ కార్యక్రమాలు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. పదవుల భర్తీతో పార్టీలో కొంత ఊపు వచ్చిందన్నది వాస్తవం.దాదాపు పదిహేను నెలల నుంచి పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదు. చంద్రబాబు పిలుపు నిచ్చినా అరకొరగా తప్ప ఎక్కడా పార్టీ కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టలేదన్నది వాస్తవం. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎన్నికల్లో ఓటమితో కోలుకోలేక పోవడం ఒక కారణం అయితే అక్రమ కేసులు బనాయిస్తారన్న భయం కూడా కొంత కారణం. అందువల్లనే అనేకమంది జిల్లా అధ్యక్షులు పార్టీ పిలుపునకు పెద్దగా స్పందన రాలేదు.చంద్రబాబు కూడా హైదరాబాద్ లోనే ఉండటం కూడా నేతలు లైట్ గా తీసుకున్నారు. అయితే ఎక్కడెక్కడ ఎవరు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిచారన్న విషయాలను కేంద్ర నాయకత్వం ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుెకుంటుంది. చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లలో దీనిపై నేతలను ప్రశ్నిస్తున్నా వారి నుంచి పెద్దగా సమాధానం రావడం లేదు. పదవులు లేనందునే ఇలా డీలా పడ్డారన్నది వాస్తవం.ఇక తాజాగా అన్ని జిల్లాలకు కలిపి 51 మంది నేతలకు పదవులను ఇచ్చారు చంద్రబాబు. రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక ఇన్ ఛార్జితో పాటు జల్లాకు ఒక సమన్వయ కర్తను నియమించడంతో ఇక పార్టీ కార్యక్రమాలు సజావుగా సాగుతాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. తాజాగా ప్రకటించిన పదవుల్లో బీసీలకు ఎక్కువగా కేటాయించడంతో ఆ వర్గం నుంచి మద్దతు ఎక్కువగా లభిస్తుందని కూడా చంద్రబాబు ఆశిస్తున్నారు. ఇకపై టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వేగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ నియామకాలు ఉపయోగపడతాయన్నది వాస్తవం.

Related Posts