YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఫైర్ బ్రాండ్లు కు ప్ర‌మోష‌న్..

ఫైర్ బ్రాండ్లు కు ప్ర‌మోష‌న్..

న్యూఢిల్లీ అక్టోబ‌రు 5, 
బిజెపి లో వారిద్దరూ చేరినా తగిన ప్రాధాన్యత ఇప్పటివరకు లభించలేదు. ఒకరు తెలంగాణ లో ఫైర్ బ్రాండ్ అయితే మరొకరు తెలంగాణ లో చరిష్మా ఉన్న లీడర్. ఇరువురు రాష్ట్ర అధ్యక్ష పదవులు ఆశించి భంగపడ్డారు. వారిద్దరే డికె అరుణ, దగ్గుబాటి పురంధరేశ్వరి. వీరిలో అరుణ కమలం జాతీయ ఉపాధ్యక్షురాలు గా, పురంధరేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి కావడం వెనుక బిజెపి వ్యూహం తో బాటు ఇద్దరికి న్యాయం చేయాలిసిన బాధ్యత నెరవేర్చుకున్నట్లు కనిపిస్తుంది.డికె అరుణ, పురంధరేశ్వరి తెలుగు రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. తమ తండ్రుల నుంచి పుణికిపుచ్చుకున్న రాజకీయాలకు మెరుగులు మరింత దిద్దుకున్నారు. ఎన్టీఆర్ తనయ గా అరంగేట్రం చేసినా పురంధరేశ్వరి తనలో ప్రతిభకు సానపడుతూనే వచ్చారు. యుపిఎ సర్కార్ లో కేంద్రమంత్రిగా అప్పగించిన బాధ్యతలను పురంధరేశ్వరి చక్కగా నిర్వర్తించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ హోదాలో డికె అరుణ సమర్ధవంతమైన పాత్రనే పోషించారు. ఇద్దరు తమకంటూ రాజకీయ లక్ష్యాలను నిర్దేశించుకున్నవారే. వాస్తవంగా మహిళలకు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే అవకాశాలు బాగా తక్కువ ఉంటాయి. కుటుంబ సహకారం, రాజకీయ నేపధ్యాలు ఉంటె తప్ప వారు ముందుకు వెళ్ళలేరు. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో మహిళలు రాజకీయాల్లో దూసుకుపోవడం చిన్న విషయం కాదు.అటు తెలంగాణ, ఇటు ఎపి లో తమ ఉనికి ని చాటుకోవాలని కమలం తహ తహ లాడిపోతుంది. ఈ నేపథ్యంలో కొత్త ఫార్ములాతో నయా టీం లతో తమ దళాలలను బిజెపి సిద్ధం చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరి మహిళలకు పెద్దపీట వేయడం గమనిస్తే అనేక ఈక్వేషన్స్ వీటి వెనుక ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కుల సమీకరణలతో పాటు వారి కెపాసిటీ, క్యాలిబర్ అంచనా వేసే బాధ్యతలు బిజెపి అప్పగించినట్లు తెలుస్తుంది. మరోపక్క ఎపి, తెలంగాణ లలో దూకుడు గా సాగే అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం ఈ నేపథ్యంలో వీరి సేవలు జాతీయ రాజకీయాలకు వినియోగించుకుంటారా లేక రాష్ట్ర రాజకీయాల్లో కూడా వీరికి పెత్తనం అప్పగిస్తారా అన్నది వేచి చూడాలి.

Related Posts