రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశముందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈమేరకు ఈ ఐదు రోజులు ఎండిలు మండిపోతాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈనెల 18వతేదీ నుంచి 20వరకు పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అలాగే మిగిలిన జిల్లాల్లో 41 డిగ్రీలకంటే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అలాగే 21 వతేదీ నుంచి 22 వరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 44డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో 42 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.