YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బీరు కు నో చెబుతున్న సిటీజ‌నులు

బీరు కు నో చెబుతున్న సిటీజ‌నులు

హైద్రాబాద్,అక్టోబ‌రు 5, 
మద్యం ప్రియులు బీర్ల జోలికి వెళ్లడం తగ్గించేశారు. దాని స్థానంలో హార్డ్ లిక్కర్‌నే ఎక్కువగా తాగేస్తున్నారు. గత రెండు నెలలుగా బీర్ల అమ్మకాలు భారీగా పడిపోవడమే ఇందుకు నిదర్శనం. చల్లటి బీరు తాగితే జలుబు చేసి జలుబు, దగ్గు వంటివి వస్తాయేమో అనే అనుమానంతో సాధారణ మద్యమే సేవించారు. జలుబు, దగ్గు వంటివి వస్తే ప్రస్తుత కరోనా సమయంలో ఇబ్బందులు వస్తాయని బీర్ల జోలికి వెళ్లడం తగ్గించేశారు. కొద్ది రోజుల క్రితం వరకూ బాగా వర్షాలు కురిసి వాతావరణం చల్లగా ఉంది. ఈ క్రమంలో చల్లని బీరు సేవిస్తే జలుబు వంటిది సులభంగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాక, బీర్ల ధరలు విపరీతంగా పెరగడం కూడా దానిని దూరం పెట్టేందుకు ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలతో పోల్చితే బీర్ల అమ్మకాలు సుమారు 20 శాతం తగ్గినట్లు ఎక్సైజ్‌శాఖ గణాంకాలు చెబుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో గతేడాది సెప్టెంబర్‌లో 1.83 లక్షల బీర్ కేసులు విక్రయాలు జరిగితే, గతనెలలో అమ్మకాలు 1.40 లక్షల కేసులకు పడిపోయాయి.గత ఏడాది సుమారు రూ.120 ఉన్న స్ట్రాంగ్‌ బీరు ఇప్పుడు రూ.160కి పెరిగింది. రెండు బీర్లు కొనే చోట బ్రాండెడ్‌ లిక్కర్‌ క్వాటర్‌ వస్తుండడంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. అందుకే బీర్ల అమ్మకాలు పడినట్లు తెలుస్తోంది. అయితే, అమ్మకాలు పడినా ఆదాయం మాత్రం తగ్గలేదు. అమ్మకాలు తగ్గినప్పటికీ ఆదాయం పెరగడానికి కారణం బీర్ల ధరలు పెరగడమేనని తెలుస్తోంది.

Related Posts