బెంగళూరు అక్టోబరు 5,
కర్నాటక కాంగ్రెస్ నేత డీకే.శివకుమార్ ఇంటిపైన, ఆయన కార్యాలయాలపైన సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.అవినీతి కేసుకు సంబంధించి కర్నాటక, ముంబై లలోని ఆయన ఆఫీసుల్లోఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అందించిన సమాచారం మేరకు సీబీఐ ఈ సోదాలు, దాడులు నిర్వహించింది. మొత్తం 14 చోట్ల వీటిని నిర్వహించినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డికె సురేష్ నివాసంలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరులోని దొడ్డలహళ్లి, కనకపుర, సదాశివనగర్ ప్రాంతాల్లో శివకుమార్కి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. శివకుమార్తో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డికె సురేష్ నివాసంలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరులోని దొడ్డలహళ్లి, కనకపుర, సదాశివనగర్ ప్రాంతాల్లో శివకుమార్కి చెందిన నివాసాలు, కార్యాలయాలు, ఆయన సమీప బంధువులు, సిబ్బంది నివాసాలు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 చోట్ల సీబీఐ ఈ సోదాలు నిర్వహిస్తోంది. కర్ణాటకలో 9 చోట్ల, ఢిల్లీలో 4 చోట్ల, ముంబైలో ఒక చోట సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతల్లో ముఖ్యుడైన శివకుమార్పై నమోదైన ఒక అవినీతి కేసు విచారణలో భాగంగా సీబీఐ ఈ సోదాలు చేపట్టినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది.