YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ ఆక్టోపస్ దారేదీ..?

విశాఖ ఆక్టోపస్ దారేదీ..?

విజ‌యవాడ‌, అక్టోబ‌రు 6
ఎవరికైనా విచక్షణ అన్నది హద్దుగా ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఎన్నో ఎమోషన్లు ఉంటాయి. వాటిని ఎంతగా నియంత్రించుకున్నారు అన్న దానిమీదనే వారి వివేచన ఆధారపడిఉంటుంది. విషయానికి వస్తే విశాఖ జిల్లాలో ఒక మాజీ ఎంపీగారు.  పేరు సబ్బం హరి. ఆయన  అపరమేధావి. అంతేనా విశాఖ ఆక్టోపస్. అన్ని విషయాలు ఆయనకు అలా తెలిసిపోతూంటాయి. ఢిల్లీ లెవెల్లో చీమ చిటుక్కుమంటే ముందు ఆయనకే తెలుస్తుంది. ఇక నీతి, నిజాయతీకి ఆయన ప్రతీక అన్నది మీడియాలో ఆయన విశ్లేషణలు చూసే వారికి కలిగే సాధారణ అభిప్రాయం. మరి ఆ ముసుగు ఇపుడు ఒక్కసారిగా  తొలగిపోయిందిగా అంటున్నారు వైసీపీ నేతలు.విశాఖ మేయర్ గా పనిచేసిన హరి లక్కీగా ఒకసారి ఎంపీగా కూడా చేశారు. మొత్తానికి ఆయన అధికార వైభోగం అంతా పదేళ్ళు మాత్రమేనని వైసీపీ యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ తేల్చేశారు. తాను సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకునే హరి తాను ఆక్రమించుకున మునిసిపాలిటీ స్థలంలో అక్రమంగా కూలగొట్టిన గోడ విషయం మీద ఓ రేంజిలో మండిపడ్డారు. ఆయన సీఎం అని కూడా చూడకుండా జగన్ మీద అసభ్యపదజాలం వాడేశారు. ఇక విశాఖ ఎంపీ విజయసాయిరెడ్డిని అయితే అసలు వదలలేదు, పూర్తి ఏకవచనంతో చిందులు తొక్కేశారు. దాంతో ఆయన వైసీపీ నేతలు ఇపుడు తాపీగా అంటున్నారు. తాము కూల్చింది ఆయన ప్రహారీ గోడను కాదు, ఆయన పెద్దమనిషి వేషాన్ని అని. తొలగించింది ఆయన ముసుగును అని.ఇక హరి వయసు ఏడు పదులు దాటింది. ఆయన రాజకీయమంతా కాంగ్రెస్ లోనే సాగింది. జగన్ పక్కన ఉంటే వెలిగేవారేమో కానీ అక్కడ కూడా ఆయన సున్నం పెట్టుకున్నారని అంటారు. దాంతో చంద్రబాబు టీడీపీ ఆయనకు గతి అయింది. కాంగ్రెస్ లో ఉన్నపుడు బాబుని ఇష్టం వచ్చినట్లుగా విమర్శించిన హరి మీద చంద్రబాబుకు కూడా  ఏమంత మంచి అభిప్రాయం ఉండాలని లేదు, కానీ రాజకీయం, పైగా జగన్ గుట్టూ మట్టూ తెలిసి బయటకు వచ్చారు అని గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. కంచుకోట భీమిలీలో ఆయన ఓటమి చెందారు. ఇక ఇపుడు విశాఖ ఎంపీ సీటుకే కర్చీఫ్ వేశారు. అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయనకు ఆ టికెట్ ఇస్తారా అన్నది అతి పెద్ద ప్రశ్న.హరిని ఫుల్ టైం పొలిటీషియన్ గా కంటే సెటిలెమెంట్స్ చేసే  పెద్దగానే విశాఖలో చూస్తారని అంటారు. ఆయన వెంట రాజకీయ నాయకులు ఎవరూ కనిపించరు. పైగా ఆయన కాంగ్రెస్, వైసీపీ, టీడీపీలలో తిరిగినా కూడా విశాఖలో ఆయనకు పెద్దగా బలం లేదు. తనకంటూ వర్గమూ లేదు. ఆయన పార్టీ బలం చూసుకునే రెచ్చిపోతారు. అంటే సుదీర్ఘ రాజకీయం అని చెప్పుకునే హరికి టికెట్ ఇస్తే ఆయన వైపు నుంచి ప్లస్ గా ఏమీ రాదు అన్నది బాబుకు కూడా తెలుసు. పైగా పార్టీకి బరువే తప్ప  మరేంకాదు అని కూడా ఆలోచిస్తారుగా. ఇక హరి నోటి వాటం, ఆయన తిట్ల పురాణం అనుకూల మీడియా సాక్షిగా కళ్లారా చూసిన తరువాత బాబు కూడా జాగ్రత్తపడకుండా ఉంటారా. మొత్తానికి వైసీపీ తెలివిగా ఆయన ఇంటి గోడను కూల్చినట్లే కూల్చి ఆయన రాజకీయ గోడను కూడా కూల్చేసిందని కామెంట్స్ పడుతున్నాయి

Related Posts