YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దుబ్బాక‌లో త్రిముఖ పోటీ..?

దుబ్బాక‌లో త్రిముఖ పోటీ..?

మెద‌క్, అక్టోబ‌రు 6, 
దుబ్బాక ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే బీజేపీ వినా కాంగ్రెస్, తెరాసాలు మాత్రం దుబ్బాక ఉపఎన్నికలో అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయానికి రావడంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. బిజెపి  దాదాపుగా రఘునందనరావు అభ్యర్థిత్వాన్ని ప్రకటించింనట్లుగానే భావించాలి. ఇక కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల విషయంలో స్పష్టత రాలేదు. తెరాస దివంగత రామలింగారెడ్డి భార్యను దుబ్బాకు ఉపఎన్నికలో పోటీకి దించుతున్నట్లుగా పార్టీ శ్రేణులు చెబుతుంటే...అధిష్టానం నుంచి మాత్రం ఇంత వరకూ స్పష్టత లేదు. ఒక దశలో మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి తనయుడికి తెరాస టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయన్న వార్తలు సైతం వినిపించాయి.అయితే ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో...ఆయన కాంగ్రెస్ తరఫున దుబ్బాక అభ్యర్థిగా నిలుస్తారని భావిస్తున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కు అసమ్మతి సెగ తప్పకపోవచ్చు. దుబ్బాక నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి నిలవాలని ఆశిస్తున్నారు. పార్టీ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని దాదాపు ఓకే చేసింది. ఉమ్మడి మెదక జిల్లా నేతల సూచన మేరకు నర్సారెడ్డినే అభ్యర్థిగా అధిష్ఠానానికి ప్రతిపాదించాలని పార్టీ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయం కూడా తీసేసుకున్నారు. అయితే అనుకోకుండా చెరుకు ముత్యం రెడ్డి చెరుకు శ్రీనివాసరెడ్డి పేరు ఆఖరి నిముషంలో తెరపైకి వచ్చింది.కాంగ్రెస్ తెరాల వ్యవహారాల ఇన్ చార్జ్ ఈ నేపథ్యంలోనే దుబ్బాకలో అభ్యర్థి ఎవరన్నది కాదనీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గుర్తు మాత్రమే ప్రధానమని శ్రేణులకు ఉద్బోధించారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి బదులు చెరుకు శ్రీనివాసరెడ్డిని నిలబెట్టడమే ఖాయమైన పక్షంలో అసమ్మతి తప్పదని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఈ పరిణామంతో దుబ్బాకు నుంచి తెరాస అభ్యర్థిగా దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి భార్య పోటీలో ఉంటారని భావించాల్సి ఉంటుంది. అయితే తెరాస అధినేత నుంచి ఈ విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. బీజేపీని మినహాయిస్తే కాంగ్రెస్, తెరాసలు రెండూ అభ్యర్థి విషయంలో ఊగిసలాట ధోరణినే ప్రదర్శిస్తున్నాయి. ఏ చిన్న తేడా జరిగినా పార్టీ అభ్యర్థికి అసమ్మతి పోటు తప్పదన్న అభిప్రాయమే ఇందుకు కారణం కావచ్చు.  ప్రతిష్టాత్మకంగా భావించి రంగంలోనికి దిగుతున్న సమయంలో కూడా ప్రధాన పార్టీల అభ్యర్ధుల ఎంపికలో జరుగుతున్న తాత్సారం చూస్తుంటే పార్టీలు చెబుతున్నట్లుగా ఇక్కడ వాటి విజయం నల్లేరు మీద బండినడక కాదా అన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

Related Posts