YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అన్నాడీఎంకేలో వ‌ర్గ‌విబేధాలు

అన్నాడీఎంకేలో వ‌ర్గ‌విబేధాలు

చెన్నై, అక్టోబ‌రు 6, 
తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే చతికల పడటం ఖాయంగా కన్పిస్తుంది. ఎన్నికలకు నెలలు ముందే పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడటంతో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే కు ఒక నాయకత్వం లేకుండా పోయింది. అధికారం ఉండటంతో నాయకులు, కార్యకర్తలు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారన్నది కాదనలేని వాస్తవం. పళనిస్వామి ముఖ్యమంత్రిగా, పన్నీర్ సెల్వం ఉపముఖ్యమంత్రిగా మూడున్నరేళ్ల పాటు విజయవంతంగా కొనసాగగలిగారు.తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు ఇప్పుడు నాయకత్వ సమస్య వచ్చిపడింది. జయలలిత నాడు ముఖ్యమంత్రిని చేసిన పన్నీర్ సెల్వం, శశికళ ముఖ్యమంత్రిగా చేసిన పళనిస్వామిలు రెండు గ్రూపులుగా విడిపోయినట్లే. గత కొంతకాలంగా వీరి మధ్య నాయకత్వం వివాదాలు తలెత్తాయి. మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయంపై బేధాభిప్రాయాలు తలెత్తతాయి.తననే ముఖ్యమంత్రిగా ప్రకటించాలని పళనిస్వామి కోరుతుండగా, తననూ ప్రకటించాలని పన్నీర్ సెల్వం కోరుతున్నారు. ఇటీవల జరిగిన అన్నా డీఎంకే సమావేశంలో ఈ రెండు వర్గాలు నినాదాలతో హోరెత్తించాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయం ఎటూ తేలకుండానే ఈ సమావేశం వాయిదా పడింది. అక్టోబరు 7వ తేదీన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటిస్తామని చివరకు సమావేశం తేల్చింది. ఆరోజుల పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు కలసి సంయుక్తంగా ప్రకటిస్తారని నిర్ణయించారు.ఇంతవరకూ బాగానే ఉన్నా తమిళనాడు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నించకుండానే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కొట్లాడుకోవడం ఎంతవరకూ సబబన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలకు వెళుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య విభేదాలతో నేతలు, క్యాడర్ పార్టీ వీడిపోవడం ఖాయమంటున్నారు. ఈసారి ఎన్నికల్లో అన్నాడీఎంకేకు అంత ఈజీ కాదు. డీఎంకే, కమల్ హాసన్, రజనీకాంత్ పార్టీలు రంగంలోకి వస్తుండటంతో వీరు గెలుపు కోసం ప్రయత్నించకుండా కుర్చీ కోసం కాట్లాడుకోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Related Posts