YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దేవాదాయ తాత్కాలిక సిబ్బందికి శుభవార్త

దేవాదాయ తాత్కాలిక సిబ్బందికి శుభవార్త

రాష్ట్రంలోని వివిధ దేవస్ధానాల్లో పనిచేస్తున్న ఎన్నారెం, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనం నిర్ణయించేందుకు కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ ఛైర్మన్ దేవదాయ కమీషనర్ అనురాధ ఛైర్మన్ గా వ్యవహరిస్తారని ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి తెలిపారు. సభ్యులుగా  దేవదాయ శాఖ డిప్యూటీ సెక్రెటరీ సూర్యనారాయణ, దేవాదాయ శాఖ లీగల్ అడ్వైజర్ కె. సూర్యారావు(రిటైర్డ్ న్యాయమూర్తి), రీజినల్ జాయింట్ కమీషనర్స్1&2 ( ఈ.వో ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి) సభ్యులుగా ఉంటారు. దేవాలయాల్లో పనిచేస్తున్న వారి వేతనాలకు సంబంధించి దేవదాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మరో వైపు దుర్గగుడి పాలకమండలి, ఈ.వో పద్మ, దేవాస్థానం అధికారులతో ఉపముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.  దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయం ప్రతిష్ఠ పెంచేందుకు క్రుషి చేయాలని పాలకమండలిని కోరారు.  రాష్ట్ర రాజధాని లో ఉన్న ఈ పవిత్ర దేవాలయంలో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతుందన్న విషయం సభ్యులు గుర్తుంచుకోవాలన్నారు. 

దేవాలయంలో కల్పిస్తున్న వసతులు పై దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయ పాలకమండలి మరియు ఈవో తో ఉపముఖ్యమంత్రి చర్చించారు. సామాన్య భక్తులకు సత్వరంగా అమ్మవారి దర్శనం కలిగించడంతో పాటు దేవాలయ పనితీరు మెరుగుపరిచేందుకు మీ సలహాలు, సూచనలు ఇవ్వాలని బోర్డు సభ్యులను అడిగారు. భక్తులకు వైద్య సదుపాయాలు అందించేందుకు కొండ పైన ఒక క్లినిక్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  వేసవి తీవ్రతను ద్రుష్టిలో  అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా  మజ్జిగ, మంచినీళ్లు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాదాయ దేవస్థానం లో సిబ్బంది, పురోహితులు చాలా కాలం నుండి ఒకే చోట పనిచేస్తుండడం వల్ల వారి పై ఆరోపణలు ఎక్కువయ్యాయని, వీరిని వేరే దేవాలయాలకు బదిలీ చేసే వెసులుబాటు ఏమైనా ఉందా అని అధికారులను ప్రశ్నించారు.  తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం లో కూడా దేవాలయ నిర్వహణ వేరుగా, పరిపాలనా వ్యవహారాలు వేరుగా నిర్వహించేందుకు  ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ ను నియమిస్తే ఎలా ఉంటుందని దేవాలయ కార్యనిర్వహణ బోర్డు, ఈవో ను ను ప్రశ్నించారు

Related Posts