అమరావతి అక్టోబర్ 6
శ్రీలంక దేశంలో లాగానే ఏపీలో కూడా ఫ్టోటింగ్ క్యాసినోల ఏర్పాట్లు.. అంటూ వార్తలు వెలువడ్డ వార్తలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు.ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లోటింగ్ క్యాసినోలకు చాన్స్ లేదని మంత్రి స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఈ వార్తా కథనాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. ఈ తరహా కార్యకలాపాలను ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించదని తేల్చిచెప్పారు.ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ గేమింగ్ చట్టాలను కఠినంగా అమలుచేసింది. ఎక్కడా పేకాట.. ఆన్ లైన్ రమ్మీ సహా డ్రీమ్ 11 వాటి డబ్బులు పెట్టే గేమింగ్ లపై కూడా నిషేధం విధించింది. ఇటీవల కర్నూలు జిల్లాలోనూ పేకాట క్లబ్ పై దాడి చేసి పలువురిని అరెస్ట్ చేసింది. సమాజ శ్రేయస్సు కోసం జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఏపీలో పర్యాటకం ఒక ముఖ్యమైన రంగమని పేర్కొన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి కోసం తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని అవంతి స్పష్టం చేశారు. క్యాసినోలకు ఏపీలో చాన్స్ లేదని క్లారిటీ ఇచ్చారు.