YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

చైనాతో కలిసి పాక్ కుయుక్తులు.. గిల్గిత్-బాల్టిస్థాన్ను ఆక్రమించుకొనే యత్నం

చైనాతో కలిసి పాక్ కుయుక్తులు..     గిల్గిత్-బాల్టిస్థాన్ను ఆక్రమించుకొనే యత్నం

న్యూ ఢిల్లీ  అక్టోబర్ 6 
దాయాది దేశం పాకిస్థాన్.. పోరుగుదేశం చైనాతో కలిసి కుయుక్తులు పన్నుతోంది. భారత్ ను బలహీన పరించేందుకు చైనా పాక్ పన్నాగం మొదలుపెట్టాయి. ఇండియా-చైనా-పాకిస్దాన్ మధ్య  నో మ్యాన్స్ ల్యాండ్ (ఎవరికీ చెందని) ఒకటి ఉంది. దానిపేరే గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రస్తుతం ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు పాక్ తీవ్రంగా యత్నిస్తున్నది. ఇప్పటికే అక్కడ కొన్ని  పనులు కూడా మొదలు పెట్టింది. ఈ ప్రాంతం పాకిస్థాన్ వశమైతే భారత్ రక్షణ సంబంధిత వివాదాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేలాది కిలో మీటర్లలో విస్తరించిన ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకొంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం గిల్గిత్ –బాల్టిస్ధాన్(జీబీ) ప్రాంతం స్వయం ప్రతిపత్తితో కంటిన్యూ  అవుతోంది. ఈ ప్రాంతం విషయంలో ఏ దేశం జోక్యం  చేసుకోకూడదు.  అయితే ఈ స్థలం పై పాకిస్థాన్ ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తోంది. అంతేకాకుండా తమ సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ ప్రాంతమంతా తమదే అన్న పద్దతిలో   విధానపరమైన మార్పులు చేస్తోంది. జీబీ ప్రాంతం మొత్త ఆసియా ఖండంలోనే మూడు దేశాలకు అత్యంత కీలకమైన ప్రాంతం.
మూడు అణ్వస్త్ర దేశాల భూభాగాలు కలిసే ప్రాంతమైన మధ్య ఆసియా నైరుతి ఆసియా దక్షిణాసియా తో పాటు అనేక ప్రాంతాలను జీబీ మార్గమే కలుపుతోంది. వాస్తవానికి ఈ ప్రాంతం చైనాకు  ఎంతో కీలకం. ఆ దేశం ఏర్పాటు చేయబోతున్న సిల్క్ రూట్ తో పాటు ఎకనామికల్ క్యారిడార్ ఈ ప్రాంతం గుండానే వెళ్లాల్సి ఉంటుంది. అందుకే చైనా కుయుక్తులతో పాకిస్థాన్ను ఉసిగొల్పుతున్నట్టు సమాచారం. 1845-46 ప్రాంతంలో ఈ ప్రాంతం మొత్తాన్ని సిక్కులే పరిపాలించారు. అంటే చరిత్ర ను తీసుకున్నా భౌగోళికం గా తీసుకున్నా అందుబాటు లో ఉన్న  ఆధారాల ప్రకారం పై ప్రాంతం మనకు చెందిందే. వాస్తవానికి ఈ ప్రాంతం పై పూర్తి హక్కులు భారత్ కే ఉండాలి. కానీ ఇప్పుడు ఆక్రమించుకొనేందుకు డ్రాగన్ కుట్రలు పన్నుతోంది.

Related Posts