YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

త్రిపుర వెదురు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి జోగు రామన్న

త్రిపుర వెదురు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి జోగు రామన్న

త్రిపుర రాష్ట్రం గోమతి జిల్లాలోని పరాతియా అటవీ ప్రాంతంలో ఉన్న వెదురు పరిశోధన క్షేత్రాన్ని మంత్రి జోగు రామన్న, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు ఈ పరిశోధన క్షేత్రంలో ఆస్పర్, మోసా, కాటబోరక్ వెదురు రకాలను త్రిపుర అటవీ అధికారులు మంత్రి జోగు రామన్న కు వివరించారు  త్రిపుర రాష్ట్రంలో వెదురు వినియోగం భారీ ఎత్తున ఉండటంతో పలు రకాల వెదురు జాతులను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు.  తెలంగాణలో పెరుగుతున్న కాటబోరక్ జాతి వెదురు త్రిపుర రాష్ట్రంలోనూ పెంచడాన్ని మంత్రి జోగు రామన్నకు అధికారులు వివరించారు  వెదురును ఉపయోగించి అధునాతన విధానంతో వివిధ రకాలవెదురు ఉత్పత్తులతో మేధర కులస్తులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు మంత్రి జోగు రామన్న వెల్లడించారు.  దట్టమైన వెదురు పరిశోధన క్షేత్రాన్ని మంత్రి జోగు రామన్న పరిశీలించారు.  ఈ పర్యటనలో  పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా, ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలోక్ కుమార్, మేధర సంఘం ప్రతినిధులు బాలరాజ్, వెంకట రాముడు, శ్రీనివాస్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు

Related Posts