హైదరాబాద్ అక్టోబర్ 6
తెలంగాణ హైకోర్టు ఆవరణలో ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. గోదావరి ఖని కి చెందిన కవిత తాను వేసిన కేసు చాలా రోజులుగా పెండింగులో వుండడం, ఈ కేసులో తీర్పు రాకపోవడంతో నిరాశ తో ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. మంగళవారం నాడు హైకోర్టు కు వచ్చి ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకే ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు కవిత ను అడ్డుకున్న హైకోర్టు సెక్యూరిటి అమెను రక్షించారు. తరువాత ఆమెను సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చుబెట్టి కవిత ను విచారించారు. కవితపై ఈ యేడాది ఏప్రిల్ 11 న మురళి అనే వ్యక్తి ఆత్యాచారం చేసాడని ఆమె ఫిర్యాదు చేసిందని సమాచారం.