YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఏకాభిప్రాయంతో సమస్య పరిష్కారం - గజేంద్ర షెకావత్

ఏకాభిప్రాయంతో సమస్య పరిష్కారం -  గజేంద్ర షెకావత్

న్యూఢిల్లీ, అక్టోబరు 6 సెప్టెంబర్ 6 
ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్  రెండు గంటల పాటు భేటీ సాగింది.  ఇరు ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించాయి. గోదావరి, కృష్ణా బేసిన్‌లో నీటి వినియోగం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై ఇప్పటికే రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదనలు వినిపించారు. ప్రధానంగా నాలుగు అంశాలపై సమావేశంలో చర్చించారు.కృష్ణా గోదావరి నదిపై ఏ ప్రాజెక్ట్ కట్టాలి అన్నా సరే దానికి అనుమతి ఇచ్చేది కచ్చితంగా అపెక్స్ కమిటీనేనని ఆయన స్పష్టం చేసారు. ఆ అధికారం అపెక్స్ కమిటీకి మాత్రమే ఉందన్న ఆయన ఈ సమావేశంలో మొత్తం నాలుగు అంశాల ఎజెండా పై నేడు చర్చించామని అన్నారు. విభజన చట్టంలోనే అపెక్స్ కమిటీ ఉందన్న ఆయన్న ఏపీ తెలంగాణా మధ్య జల వివాదాల కోసమే అపెక్స్ కమిటీ ఏర్పాటు అయిందని వివరించారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఒక పరిష్కారానికి వచ్చామని ఆయన అన్నారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించామ‌ని కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర  సింగ్‌ షెకావ‌త్ తెలిపారు.2014లో తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు స‌మ‌యంలో విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అపెక్స్ కౌన్సిల్ ఏర్ప‌డింది. చ‌ట్టం ప్ర‌కారం కృష్ణా న‌దీ జ‌లాల బోర్డు ఏర్పాటైంద‌ని తెలిపారు. ఇవాళ ప్ర‌ధానంగా నాలుగు అంశాల‌పై చ‌ర్చించామ‌ని పేర్కొన్నారు. స‌మావేశంలో ఇద్ద‌రు సీఎంలు త‌మ‌త‌మ వాద‌న‌లు వినిపించారు. రెండు రాష్ర్టాలులేవ‌నెత్తిన అంశాల‌పై చ‌ర్చించామ‌న్నారు. కృష్ణా, గోదావ‌రి ప్రాజెక్టుల‌పై కొత్త నిర్మాణాల‌కు అనుమ‌తి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు మాత్ర‌మే ఉంద‌న్నారు ఉంది. కొత్త ప్రాజెక్టుల‌కు డీపీఆర్‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని ఇరు రాష్ర్టాల సీఎంల‌ను కోరామ‌ని తెలిపారు. డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇరు రాష్ర్టాల సీఎంలు సుముఖ‌త వ్య‌క్తం చేశార‌ని పేర్కొన్నారు.  కృష్ణా ట్రిబ్యున‌ల్‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. ట్రిబ్యున‌ల్ ద్వారా నీటి కేటాయింపులు జ‌ర‌గాల‌ని సీఎం కేసీఆర్ కోరారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఓ ప‌రిష్కారానికి  వ‌చ్చామ‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అన్ని నిర్ణయాలు తీసుకుంటామ‌న్నారు.  పోతిరెడ్డిపాడు, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు అని తెలిపారు. 2016లో మొద‌టి అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ రెండోసారి కౌన్సిల్ భేటీ అయిందిఅలా వివాదాలకి పోకుండా సహకరించిన ఇద్దరు సీఎంలు జగన్, కేసీఆర్ లకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
బలమైన వాదనలు వినిపించిన రాష్ట్రాలు
ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న జలవివాదాలతో పాటు ఇటీవల తలెత్తిన నీటి కేటాయింపుల సమస్యలపై చర్చించేందుకు కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీ 2 గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ బలమైన వాదనలు వినిపించాయి.పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిబంధనలను పాటిస్తూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నామని ఏపీ స్పష్టం చేసింది. తాము వాడుకుంటున్నది మిగులుజలాలను మాత్రమేనని, ఇందులో తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఏపీ తన వాదనలు వినిపించింది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలు కృష్ణా నదీ జలాలపైనే తమ వాదనలు వినిపించాయి. ఈ సమావేశంలో నాలుగు ప్రధాన అంశాలను చర్చించాలని అజెండా రూపొందించినప్పటికీ, ఆ నాలుగు అంశాల అనుబంధ అంశాలే ఎక్కువగా చర్చకు వచ్చినట్టు తెలిసింది.నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ తమకు అప్పగించాలని తెలంగాణ కోరగా, ఆ ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించాలని ఏపీ  సూచించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొనగా, ఢిల్లీలోనే ఉన్న సీఎం జగన్ జన్ పథ్-1 అధికారిక నివాసం నుంచి వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు.

Related Posts