YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో విగ్రహం ధ్వంసం

కర్నూలులో విగ్రహం ధ్వంసం

కర్నూలు, అక్టోబరు 6,
కర్నూలు జిల్లాలో నరసింహ స్వామి విగ్రహం ధ్వంసం కలకలంరేపింది. మంత్రాలయం మండలం వగరూరు చెరువు కట్ట నరసప్పతాత (లక్ష్మీనరసింహస్వామి) విగ్రహంపై ఉండే శేషపడగలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. పూజారి సోమవారం ఉదయం ఆలయానికి వచ్చి చూడగా విగ్రహంపైన ఉండే తొమ్మిది శేషపడగల్లో నాలుగింటి తలలు ముక్కలుగా పడి ఉన్నాయి. ఆయన స్థానికులకు విషయం చెప్పగా.. వారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వగరూరుకు 2 కి.మీ.దూరంలో సూగూరు జలాశయం దగ్గర ఉన్న ఆలయంలో ప్రతి సోమ, గురువారాలు పూజారి పూజలు చేస్తారు. మిగిలిన రోజుల్లో ఆలయానికి తాళం వేసి ఉంటుంది. గతేడాది కూడా ఇలాగే విగ్రహంను ధ్వంసం చేశారని.. మళ్లీ ఇప్పుడు అలాంటి ఘటనే జరిగిందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విగ్రహాలపై దాడులు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుల్ని పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.ఇటు కర్నూలు జిల్లా ఆదోనిలో ఆంజేనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న గుడిలో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన బీజేపీ నాయకులు ఆలయం వద్దకు చేరుకున్నారు. నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Posts