YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

లాకర్లు తెరిచే పనిలో అధికారులు

లాకర్లు తెరిచే పనిలో అధికారులు

హైద్రాబాద్, అక్టోబరు 6,
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు ఇవాళ రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. నర్సింహారెడ్డికి సంబంధించిన మరో బ్యాంకు లాకర్‌ను ఏసీబీ అధికారులు ఇవాళ తెరిచే అవకాశం ఉంది. బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంపై అధికారులు ఆయనను విచారిస్తున్నారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా నిన్నటి నుంచి ఏసీబీ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.నిన్న ఏసీబీ సోదాల్లో పట్టుబడిన రూ.70 కోట్ల మేర అక్రమాస్తులతోపాటు మాదాపూర్‌లోని రూ.50 కోట్ల విలువైన భూమిపై ప్రశ్నించినట్టు తెలిసింది. ఏసీపీ నుంచి ఆశించిన మేర సమాధానాలు రాలేదని సమాచారం. ఈ అంశానికి సంబంధించి ఇవాళ మరోమారు ప్రశ్నించనున్నారు. నర్సింహారెడ్డి తెరలేపిన భూ 'కొనుగోలు' దందాలో ఇప్పటికే ఈ కేసులో 13 మందిని నిందితులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో 11 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.ఈ కేసులో నలుగురు నిందితులు తమ తండ్రుల నుంచి గిఫ్ట్‌డీడ్‌ల కింద సదరు భూమి వచ్చినట్టు యాజమాన్య పత్రాలు సృష్టించి, విక్రయించినట్టు ఇప్పటికే ఆధారాలు లభించాయి. గిఫ్ట్‌డీడ్‌లను ఇస్తూ సంతకాలు పెట్టిన మరో ముగ్గురి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నట్టు తెలిసింది. ఏసీపీ నరసింహారెడ్డి ఈ గిఫ్ట్ డీడ్ నుంచి నర్సింహారెడ్డి భార్య పేరుతో పాటు మరో నలుగురు భినామిల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అందులో 2 వేల గజాల భూమి ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు తేల్చారు.

Related Posts