YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తిరుప‌తిలో పోటీపై టీడీపీ స‌ర్వే

తిరుప‌తిలో పోటీపై టీడీపీ స‌ర్వే

తిరుప‌తి, అక్టోబ‌రు 7, 
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సిట్టింగ్ ఎంపీ మరణించడంతో పాటు, ఆయనకు ఎక్కువగా టీడీపీతో అనుబంధం ఉండటంతో చంద్రబాబు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై సీనియర్ నేతలతో చర్చించి పార్టీ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే బల్లి దుర్గాప్రసాద్ కు తెలుగుదేశం పార్టీ తో సుదీర్ఘకాలం అనుబంధం ఉంది. 1985 లో రాజకీయాల్లోకి వచ్చిన బల్లి దుర్గాప్రసాద్ 2019 ఎన్నికల ముందు వరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. దీంతో ఆయనకు పార్టీతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని పోటీకి దూరంగా ఉంటే ఎలా ఉంటుందన్న దానిపై చంద్రబాబు సీనియర్ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు.అయితే అక్కడ ఎన్నిక జరిగితే జనసేన, బీజేపీ అభ్యర్థి ఉంటే ఎలా అన్న దానిపై కూడా చంద్రబాబు చర్చిస్తున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఓటమి పాలయితే దానికి రాజధాని అమరావతితో వైసీపీ ముడిపెట్టే అవకాశముండటంతో చంద్రబాబు పోటీపై తర్జన భర్జన పడుతున్నారు. పోటీకి దూరంగా ఉంటే మేలా? లేక బరిలోకి దిగడమే మేలా? అన్నదానిపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. పోటీ చేయకకపోవడానికి బలమైన కారణం ఉందని నేతలకు చెబుతున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో సర్వే జరిపితే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారు.కానీ బలం లేకున్నా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం, ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని, భయపడి వెనక్కు తగ్గారంటారని కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. అయితే నియోజకవర్గంలో పూర్తి స్థాయి సర్వే జరిపిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంంలో తిరుపతి మినహా ఏ ఒక్క నియోజకవర్గంలో మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడంతో పోటీపై చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది

Related Posts