YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

త‌లైవా రాక కోసం...

త‌లైవా రాక కోసం...

చెన్నై, అక్టోబ‌రు 7, 
త‌మిళనాడు రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి. అరవ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపినా ఏకపక్షంగానే ఉంటుందంటారు. ఇక్కడ సెంటిమెంట్లు, అభిమానం కూడా ఎక్కువే. దీంతో తమిళనాడు ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ కోసం అనేక పార్టీలు ఎదురు చూస్తున్నాయి. రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటిస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని దాదాపు అన్ని పార్టీలూ ఎదురు చూస్తున్నాయిప్రస్తుతం అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకే కూటమిలో ఉన్న అన్ని చిన్నా చితకా పార్టీలన్నీ రజనీకాంత్ పార్టీ కోసం వేచి చూస్తున్నాయి. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని రజనీకాంత్ ఇప్పటికే ప్రకటించారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోనని, ప్రజలకు సేవ చేసే వారిని తమ పార్టీ తరుపున ముఖ్యమంత్రి అవుతారని రజనీకాంత్ ప్రకటించడంతో చిన్నా చితకా పార్టీలు దానివైపు ఆశగా ఎదురు చూస్తున్నాయిరజనీకాంత్ ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. అన్ని పార్టీలూ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ప్రధానంగా డీఎంకేలో కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలున్నాయి. అయితే ఈసారి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు డీఎంకే సుముఖంగా లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలో రజనీకాంత్ తో జతకట్టాలని భావిస్తున్నాయి. ఈ మేరకు ఆయనకు ఫోన్లు చేస్తున్నారు. పార్టీ ఎప్పుడు పెడతారని ప్రశ్నిస్తున్నారు. దీనికి రజనీకాంత్ నుంచి సరైన సమాధానం రావడం లేదు.ఇక అన్నాడీఎంకేలో ఉన్న పార్టీలు కూడా రజనీకాంత్ వైపు చూస్తున్నాయి. చిన్న పార్టీలు అనడం కంటే అన్నాడీఎంకేలో కీలక నేతలు కూడా రజనీకాంత్ పార్టీ పెడితే జంప్ అవుదామని కాచుక్కూర్చున్నారు. ఇక బీజేపీ సయితం రజనీకాంత్ పార్టీ పెడితే పొత్తుతో తమిళనాడు ఎన్నికలకు వెళ్లాలన్న ప్లాన్ లో ఉంది. కానీ రజనీకాంత్ నుంచి ప్రకటన రావడం లేదు. ఆయన ప్రకటన కోసం తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలూ ఎదురు చూస్తున్నాయి. మరి రజనీ నుంచి ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related Posts