YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంత్రివర్గంనుంచి జూపల్లిని తొలగించాలి : డీకే అరుణ

మంత్రివర్గంనుంచి  జూపల్లిని తొలగించాలి : డీకే అరుణ

కోమటిరెడ్డి ,సంపత్ ల ఎమ్మెల్యే సభ్యత్వ రద్దు చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. కేసీఆర్ సర్కార్ కు కోర్ట్ తీర్పు చెంపపెట్టులాంటిదని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. కేసీఆర్ కు ఏమాత్రం సిగ్గు ఉన్నా, తెలంగాణ వాడివైతే వేంటనే   రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. కేసీఆర్ సర్కార్ కు కోర్ట్ మొట్టికాయలు తిని తిని మెడ్డుపారిపోయింది. కేసీఆర్ కు ఒక్క రోజు కూడా పదవిలో కొనసాగే నైతికత లేదని అన్నారు. కేసీఆర్ కు ఏమాత్రం ధైర్యం ఉన్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి. లేకుంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వచ్చినా మేము సిద్దమని అన్నారు. కోర్టు  తీర్పు పై స్పీకర్ సరైన విధంగా స్పందింవహకపోతే, ప్రజలే రాబోయే రోజుల్లో సరైన బుద్ది చెబుతారని అన్నారు. మంత్రి జూపల్లి ఇసుక మాఫియాలో మునిగి తేలుతున్నారు . జూపల్లి అండతో జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు అరుకాయలుగా కొనసాగుతోంది. బ్యాంక్స్ ను ముంచడంలో జూపల్లి అరితేరాడని ఆమె వ్యాఖ్యానించారు. జూపల్లి ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మంత్రులు చేసే అగడాలు సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదా .. లేక మంత్రులకు రాష్ట్ర దోపిడీకి రాసిచ్చాడా  అని ఆమె నిలదీసారు. నేను ప్రగతి భవన్ లో కూర్చొని దోచుకుంటున్నా .. మీరు జిల్లాల్లో దోచుకొండని మంత్రులకు చెప్పాడా అని ప్రశ్నించారు. ఆక్ర మ ఇసుక రవాణా ఎలా జరుగుతుందో చూపిస్తాం.  జూపల్లి వచ్చేందుకు సిద్ధమా అని సవాలు విసిరారు. జూపల్లి తెలంగాణ  ఖనిజ సంపదను ఆంధ్రకు తరలిస్తున్నారు .. తెలంగాణపై ఇదేనా మీకుఉండే చిత్తశుద్ధి అని ఆమె అన్నారు. జూపల్లి తాను బ్యాంకులను ముంచింది చాలదని .. ఇప్పుడు కొడుకులను కూడా రంగులోకి దించాడు. జూపల్లి కొడుకులు తండ్రికి తగ్గ తనయులుగా నిరూపింవహుకుంటున్నారు . కేసీఆర్ తక్షణం జూపల్లి ని మంత్రివర్గం నుంచి తప్పించాలి. రాజయ్యను మంత్రి పదవినుంచి తప్పించిన కేసీఆర్ .. జూపల్లి తన బందువని ఉపేక్షిస్తున్నారా అని ఆమె అన్నారు.

Related Posts