YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జక్కుల నెక్కలంలో కేంద్ర మంత్రి పర్యటన

జక్కుల నెక్కలంలో కేంద్ర మంత్రి పర్యటన

విజయవాడ అక్టోబ‌రు 7, 
గన్నవరం నియోజకవర్గం లోని జక్కుల నెక్కలం గ్రామంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ బుధవారం పర్యటించారు. అక్కడ రైతులతో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సునీల్ ధియోధర్, జీవియల్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గోన్నారు. రైతులు పండిస్తున్న పంటలు, గిట్టుబాటు ధర, మార్కెట్ లో పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ ధాన్యం, చెరకు గిట్టుబాటు ధర ఉండటం లేదు.. చాలా ఇబ్బందులు పడుతున్నాం. చెరకు పంటకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. వరి కి క్వింటాకు రెండువేల రూపాయలు చేయాలని మా విజ్ఞప్తి అని అన్నారు. కల్లాల్లో ధాన్యం ఉండకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేసేలా చూడాలి. మేము పండించిన చెరకు పంట 2250మాత్రమే ఇస్తున్నారు. అసలు గిట్టుబాటు కావడం లేదు.. రుణాలు కూడా ఇప్పించేలా చూడాలని మంత్రికి కోరారు. మంత్రి మాట్లాడుతూ  కేంద్రం తెచ్చిన కొత్త చట్టం వల్ల కరివేపాకు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం వచ్చింది.  రైతుల సమస్యలు, ఇబ్బందులు పరిష్కారం కోసమే కేంద్రం చట్టం తెచ్చినట్లు మంత్రి చెప్పారు. ఈ చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను ఇతర రైతులకు వివరించాలని ఆమె సూచంచారు.
=

Related Posts