YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

శాంతి భద్రతల విషయంలో రాజీ వద్దు

శాంతి భద్రతల విషయంలో రాజీ వద్దు

హైద్రాబాద్, అక్టోబరు 7,
శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన  కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, మంత్రులు మ‌హ‌ముద్ అలీ, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో పాటు హోం, పీసీసీఎఫ్ శోభ‌, అట‌వీశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శులు పాల్గొన్నారు.  రాష్ట్రంలో శాంతి  భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు  తీసుకోనున్నారు. ఈ భేటీలో డిజీపీతో సహా కమీషనర్స్, డిజీ స్థాయి అధికారుల అన్నీ జిల్లాల అధికారుల హాజరయ్యారు. తెలంగాణలో మావో కదలికల నేపధ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత  సంతరించుకుంది. హోం, ఆటవీశాఖ మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్, డీజీపీ, పీసీసీఎఫ్, ఆయా శాఖల కార్యదర్శులు, అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు,  ఎస్పీలతో ప్రగతిభవన్లో సీఎంతో సమావేశం అయ్యారు.దీంతో పాటు మహిళల భద్రత, డ్రగ్స్, అక్రమ రవాణా అడ్డుకట్టపై సీఎం సమీక్షించనున్నారు. అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం,  గంజాయి తదితర మాదక దృవ్యాల నియంత్రణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు . ఇటీవల కాలంలో రాష్ట్రంలో మావోల కదలికలపై పోలీసులు  దృష్టిసారించిన విషయం తెలిసిందే.ప్ భద్రద్రి కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఎక్కడికక్కడ మావోలను పట్టుకొని ఎన్ కౌంటర్లు  జరిపారు. మరోవైపు ఇప్పటికే అడవుల్లో మావోల కోసం వేట కొనసాగుతోనే ఉంది. డ్రోన్ల సాయంతో మావోల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

Related Posts