లండన్, అక్టోబరు 7
రసాయనశాస్త్రంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. ఇమ్మాన్యూయెల్ చార్పెంటీర్, జెన్నీఫర్ ఎ డౌండ్నాకు 2020 సంవత్సరానికి గాను సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. జీనోమ్ ఎడిటింగ్ విధానంలో పరిశోధనలకు గాను వీరిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం (అక్టోబర్ 7) ప్రకటించింది. ఇమ్మాన్యూయెల్ ఫ్రాన్స్‌లోని జువిసీ సర్ ఓర్జ్‌లో 1968లో జన్మించారు. బెర్లిన్‌లోని మ్యాక్స్ ప్లాంక్ యూనిట్‌లో ఆమె డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. జెన్నీఫర్ అమెరికాలోని వాషింగ్టన్‌లో 1964లో జన్మించారు. యూసీ బెర్క్‌లీలో ఆమె ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.ఆర్ఐఎస్‌పీఆర్-కేస్9 జనటిక్ కత్తెర్లు.. కణజీవ శాస్త్రంలో పూర్తి విప్లవాన్ని తీసుకువచ్చినట్లు నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. ప్లాంట్ బ్రీడింగ్‌లో ఈ విధానం వల్ల కొత్త అవకాశాలు ఉత్పన్నం అయ్యాయని చెప్పారు. క్యాన్సర్ చికిత్సలోనూ నూతన విధానం డెవలప్ అయ్యిందన్నారు. వంశపారంపర్యం వల్ల వచ్చే వ్యాధులను జనటిక్ సీజర్లతో నయం చేసే అవకాశం ఉందని నోబెల్ కమిటీ పేర్కొన్నది. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియం ఇమ్యూన్ వ్యవస్థను అధ్యయనం చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలు.. జన్యువులను వేరు చేసేందుకు ఓ కొత్త రకమైన పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు నోబెల్ కమిటీ చెప్పింది. ఈ విధానంతో లైఫ్ కోడ్‌నే మార్చివేయవచ్చు అని వెల్లడించింది. వైరస్‌లలో ఉండే డీఎన్ఏలను కూడా సీఆర్ఐఎస్‌పీఆర్ జనటిక్ సీజర్లు వేరుచేయగలవు. అత్యంత నియంత్రిత పద్ధతిలో ఎటువంటి డీఎన్ఏ కణాన్ని అయిన కత్తెరించవచ్చు అని శాస్త్రవేత్తలు ఎమ్మాన్యువెల్, జెన్నిఫర్లు నిరూపించినట్లు నోబెల్ ప్రైజ్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది.ఫ్రాన్స్‌లోని జువిసీ సర్ ఓర్జ్‌లో 1968లో ఎమ్మాన్యువల్ పుట్టారు. బెర్లిన్‌లోని మ్యాక్స్ ప్లాంక్ యునిట్‌లో ఆమె డైరక్టర్‌గా చేస్తున్నారు. మరో శాస్త్రవేత్త జెన్నిఫర్ అమెరికాలోని వాషింగ్టన్‌లో 1964లో పుట్టారు. యూసీ బెర్క్‌లీలో ఆమె ప్రోఫెసర్‌గా చేస్తున్నారు