YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్*

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్*

*కోవిడ్ బారినుంచి కోలుకున్న తర్వాత పాటించాల్సిన ప్రొటోకాల్:*
కోవిడ్-19 బారినపడి కోలుకుంటున్న వారు కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కోవిడ్-19‌ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు ఒంటి నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, నీరసంగా ఉండడం వంటి లక్షణాలు కనపడతాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (EMR డివిజన్) తెలిపింది. ఈ నేపథ్యంలో కటక్ లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలోని అనస్థీషియాలజీ మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ వైద్యులు కూడా కోవిడ్ బారి నుంచి బయటపడిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
*1. వ్యక్తిగతంగా:*
* కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా మాస్కు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, శ్వాసకోస జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.
* తగినంత మేరకు వేడి నీళ్లు తాగుతూ ఉండాలి 
* రోగనిరోధ శక్తిని పెంచుకునేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించిన మందులను వాడండి. ఆయుష్ డాక్టర్ ఇచ్చిన మందులు మాత్రమే ఉపయోగించండి.
* మీ ఆరోగ్యం సహకరిస్తే ఇంట్లో రోజువారీ పనులను చేసుకోండి. వృత్తిపరమైన పనులను కూడా క్రమపద్దతిలో ప్రారంభించవచ్చు.
*2) తేలికపాటి/ మితమైన వ్యాయామాలు:*
* శరీరం సహకరించిన మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగాసనాలను వేయడం, ప్రాణాయామం చేయడం వంటి చర్యలను రోజూ చేయాల్సి ఉంటుంది.
* చికిత్స చేసే వైద్యులు సూచించిన విధంగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి.
      * మీకు సౌకర్యంగా ఉండే చోట ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నడవడం అలవాటు చేసుకోండి.
*  సమతుల్యమైన పోషకాహారం, తాజాగా వండిన, సులువుగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి.
* తగినంత నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవాలి.
* పొగతాగడం, మద్యం సేవించడాన్ని మానేయండి.
* కోవిడ్ చికిత్స సమయంలో సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఒకవేళ ఏమైనా శ్వాసకోస సంబంధమైన ఇబ్బందులు ఉంటే వెంటనే మీకు తెలిసిన వైద్యులను సంప్రదించాలి. వ్యక్తిగతంగా ఏమైనా మందులు వాడుతున్నట్టయితే వైద్యులకు తెలియజేయాలి. వారు సూచించిన మందులను వాడాలి.
* ఇంట్లోనే ఉంటూ శరీర ఉష్ణోగ్రతను తరచూ పరీక్షించుకోవాలి. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఆక్సోమీటర్ తో ఆక్సిజన్ లెవల్స్ ను తెలసుకుంటూ ఉండాలి.
* పొడి దగ్గు / గొంతు నొప్పి ఉంటే, సెలైన్ గార్గల్స్ లేదా ఆవిరి పట్టడం చేసుకోండి. 
* కోవిడ్ ముందస్తు లక్షణాలైన తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ లెవెల్స్ 95శాతం కంటే తక్కువగా ఉండడం, ఛాతిలో నొప్పి, శరీరం బలహీనంగా మారడం, గందరగోళ పరిస్థితులు వంటివి
*3) కమ్యునిటీల స్థాయిలో:*
* కోవిడ్ నుంచి కోలుకున్నవారు ఆ సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను సోషల్ మీడియా ద్వారా గానీ, సంఘాలని గానీ, నాయకుల ద్వారా గానీ, కుల సంఘాల పెద్దల ద్వారా తమ స్నేహితులు, బంధువులతో పంచుకోవడం ద్వారా కోవిడ్ పై అవగాహన, వైరస్ పై ఉన్న వదంతులు తొలగించవచ్చు.
* స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, పౌరసమాజం, పలువురు నిపుణులతో పునరావాస చర్యలు చేపట్టండి (వైద్య, సామాజిక, వృత్తిపరమైన, జీవనోపాధి)
* సహచరులు, ఆరోగ్య కార్యకర్తల నుంచి సామాజిక మద్దతు కోరండి. అవసరమైతే మానసిక ఆరోగ్యసాయం తీసుకోండి.
* పలు సంస్థలు, గ్రూపులు నిర్వహించే యోగా, ధ్యానం లాంటి సమూహ సమావేశాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనండి.
*4) ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం:*
* కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తికి భౌతికంగాను లేదా ఫోన్ ద్వారా 7 రోజుల్లోపు సంప్రదించాలి. వీలైనంత వరకు అతను చికిత్స పొందిన ఆస్పత్రిలో అయితే మంచిది.
* దగ్గరలో ఉన్న గుర్తింపు పొందిన అల్లోపతి లేదా ఆయుష్ ప్రాక్టీషనర్, మెడికల్ ఫెసిలిటీలు ఉన్న వారు తరచూ వారిని పరీక్షించడం, ఫాలో అప్ చేస్తూ ఉండాలి. పాలిథెరపీని వీలైనంత వరకు నివారించాలి.
* ఒకవేళ హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నవారైతే ఏవైనా కోవిడ్ లక్షణాలున్నట్టు గుర్తిస్తే వెంటనే వైద్యులకు గానీ, స్థానికంగా ఉండే ఆస్పత్రికి గానీ వెళ్లాలి.
* క్లిష్టమైన, తీవ్రమైన కేసులకు సంబంధించి మరింత జాగ్రత్తలు తీసుకుంటూ సరైన విధంగా డాక్టర్లను సంప్రదిస్తూ ఫాలోఅప్ చేసుకోవాలి.
*కరోనా బారిన పడి ఆరోగ్యవంతులు అయిన తర్వాత కూడా, కరోనా తిరిగి రావటానికి అవకాశం ఉంది రెండోసారి వచ్చినట్లయితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. కనుక కరోనా పై న విజయం సాధించాను యాంటీబాడీస్ నా బాడీలో ఉన్నాయి అని అజాగ్రత్తతో ఉన్నట్లయితే కరోనా తీవ్రస్థాయిలో తిరగబెట్టే అవకాశాలు ఉన్నవి అన్న వైద్యుల  అభిప్రాయాలను గమనిస్తూ పై జాగ్రత్తలు తీసుకోవలసినదిగా ప్రభుత్వం వారు సూచిస్తున్నారు.
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*
 

Related Posts