YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీ ప్లాన్ లో చంద్ర‌న్న

బీ ప్లాన్ లో చంద్ర‌న్న

విజ‌య‌వాడ‌, అక్టోబ‌రు 8, 
చంద్రబాబుకు అనుభవం నేర్పిన పాఠాలు చాలా ఉన్నాయి. వాటికి తోడు ఆయన మెదడుతో ఎన్నో రకాలైన ఆలోచనలు ఎపుడూ ఊరుతూనే ఉంటాయి. వాటిని సరైన పద్ధతిలో అమల్లోకి పెట్టి ఎలాగైనా అధికార పీఠం పట్టేద్దామనుకుంటున్నారు. చంద్రబాబు ధీమా ఏంటి ఏపీలో ఓ వైపు బీజేపీ, జనసేన కూటమి ఉంది, మరో వైపు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్నారు. వీరిలో ఎవరూ జగన్ తో డైరెక్ట్ గా చెలిమి చేసే సీన్ లేదు. ఇక అటు వామపక్షాలు, ఇటు బీజేపీ కూటమి కూడా కలిసేది లేదు. కానీ చంద్రబాబు మాత్రం ఏపీలో జగన్ కి వ్యతిరేకంగా అందరికీ ఒక్కటి చేయాలనుకుంటున్నారుట. మనసులో మామ ఎన్టీయార్ ని తలచుకుని ఏపీవరకూ మరో నేషనల్ ఫ్రంట్ కట్టాలన్నది చంద్రబాబు ఆలోచనట.అంటే ఓ వైపు జగన్ ఉంటే ఆయన వ్యతిరేక ఓటింగ్ అంతా చెల్లాచెదురు కాకుండా ఒక్కటి చేయాలన్నది చంద్రబాబు మాస్టర్ ప్లాన్ గా ఉంది. బాబు లెక్కలు ఎలా ఉన్నాయంటే జగన్ కి వచ్చే ఎన్నికల్లో యాభై శాతం ఓట్లు రావు, అవి నలభైకైనా తగ్గుతాయి. అపుడు మిగిలిన అరవై శాతం ఓట్లు ఒక్కటిగా చేస్తే మహా కూటమికి ఏపీలో అధికారం తధ్యమని భావనగా ఉందిట. అయితే ఇక్కడ చంద్రబాబు అనుకున్నా వామపక్షాలు, బీజేపీ ససేమిరా కలవవు, పైగా కాంగ్రెస్ తో బీజేపీకి అసలు పడదు, అందువల్ల చంద్రబాబు వద్ద ప్లాన్ బీ కూడా ఉందిట.బీజేపీ జనసేనలతో టీడీపీ అవగాహన పెట్టుకుని వామ‌పక్షాలతో పాటు కాంగ్రెస్ ని చేరదీసి పెద్దన్నలా టీడీపీ బరిలోకి దిగితే కచ్చితంగా జగన్ ఓడిపోతారని లెక్కలు వేస్తున్నారుట. అంటే ఇది ఎన్టీయార్ కాలం నాటి నేషనల్ ఫ్రంట్ వ్యూహమన్నమాట. చంద్రబాబుకు కుడివైపు బీజేపీ ఉంటే ఎడమ వైపున వామపక్షాలు ఉంటాయన్నమాట. ఆ రెండు పార్టీలను అలా అనుసంధానం చేస్తూ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా పొల్లుపోకుండా ఉండాలన్నదే చంద్రబాబు మార్క్ స్ట్రాటజీ అంటున్నారు. ఇప్పటికే వామపక్షాలతో బాబు మంచిగా ఉంటున్నారు. కాంగ్రెస్ ఎటూ బాబుతో 2018 నుంచి సన్నిహితంగానే ఉంటోంది. మరో వైపు చూసుకుంటే పవన్ జనసేనను చంద్రబాబు ఒక్క మాట అనడంలేదు. పవన్ సైతం బాబుని కనీసంగా విమర్శించడంలేదు. ఆ బంధం అలాగే ఉంది. ఇక పేచీ ఒక్క బీజేపీతోనే. బీజేపీని, మోడీని పొగుడుతూ చంద్రబాబు వంతెన వేసుకుంటున్నారు కాబట్టి ఎన్నికల నాటికి అది రహదారి కావచ్చునన్న ఆశలు ఉన్నాయట.రాజకీయాల్లో ఏదీ అసాధ్యం అని చెప్పలేరు, కానీ వైసీపీతో బీజేపీకి బయటకు దోస్తీ కనిపించదు కానీ లోపల మాత్రం మిత్రులుగానే ఉంటున్నారు. పైగా చంద్రబాబుని పెద్దన్న పాత్రలో ఉంచి ఏపీలో అయిదూ పదీ సీట్లు తీసుకోవడానికి బీజేపీ ఇప్పటి నుంచే ఇన్ని వ్యూహాలు వేసి ఆయాసాలు పడనవసరం లేదు. ఇక ఏపీలో ఎదగాలంటే బాబు పార్టీని మరింతగా కుదేల్ చేయలన్నదే బీజేపీ టార్గెట్. మరో వైపు చూస్తే 2024 నాటికి కేంద్రంలో నమ్మకమైన మిత్రులు కావాలన్నది బీజేపీ మొదటి ఆలోచన. అందుకు జగన్ తప్ప చంద్రబాబు వారికి సరిపోరు. ఈ కారణాల వల్ల బాబుతో బీజేపీ పొత్తు ఎప్పటికీ కుదిరేదు కాదు అంటున్నారు. ఈ రకమైన అంచనాలు బాబు వేసుకుంటే ఆయన ఆత్మ తృప్తికే తప్ప మరెందుకూ పనికిరావు అని కూడా కొట్టేస్తున్నారు

Related Posts