YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గ్రేట‌ర్ ఎన్నిక‌ల హీట్ స్టార్ట్

గ్రేట‌ర్ ఎన్నిక‌ల హీట్  స్టార్ట్

హైద్రాబాద్, అక్టోబ‌రు 8, 
ఓ ప‌క్క వాన‌లు దంచుతున్న‌య్. క‌రోనా వ‌ల్ల కాళ్లూ చేతులు ముడుచుకుని ఇళ్ల‌ల్లో కూర్చుంటున్న‌రు జ‌నం. పనులున్న వాళ్లు, డ్యూటీలు ఉన్న వాళ్ల‌కి త‌ప్ప‌క వెళ్తున్నారు. అయితేనేం ఎల‌క్షన్లు మాత్రం ఆగేలా లేవు. దుబ్బాక ఎల‌క్ష‌న్ల ఎవ్వారం రోజూ చూస్తూనే ఉన్నం క‌దా. ఇక గ్రేట‌ర్ ఎన్నిక‌ల హీట్ కూడా స్టార్ట్ కాబోతోంది. సిటీ ఓట‌ర్ల‌కి డిమాండ్ పెరిగే టైమ్ వ‌చ్చింది. రీసెంట్ గా ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌ధి మాట‌ల్ని బ‌ట్టి చూస్తే.. ర‌ణ‌రంగం స్టార్ట్ కాబోతోంది. వ‌చ్చే నెల‌లో కానీ..డిసెంబ‌ర్ లో కానీ బ్యాలెట్ పోరు స్టార్ట్ అయ్యేలా ఉంది. అవును ఎన్నిక‌లు కూడా బ్యాలెట్ ప‌ద్ద‌తిలోనే జ‌రుగుతాయ‌ట‌.పార్టీల‌న్నీ ఓకే చెప్పాయి. ప‌ద‌కొండు పార్టీల్ని పిలిచిన ఎల‌క్ష‌న్ అధికారులు వాళ్ల ఇంట్ర‌స్ట్ లు అడ‌గ్గా.. 8 పార్టీలు ఓకే చెప్పాయ‌ట‌. అందుకే వాళ్లు కూడా అదే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే సిటీలో ఎక్క‌డ ఎన్నిక‌ల సెంట‌ర్లు ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సి అరేంజ్ మెంట్స్ ఏంటి అనే విష‌యాల‌పై ఆఫీస‌ర్లు ఓ క్లారిటీతో ఉన్నార‌ట‌. బ‌య‌టికి పెద్ద‌గా న్యూస్ రాక‌పోయినా అధికారులు మాత్రం ఆ పనిలో ఉన్నార‌ట‌. సిబ్బందిని ప‌రుగులు పెట్టిస్తూ ప‌నులు చేయిస్తున్నార‌ట‌.గ్రేట‌ర్ తో పాటు ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ , కార్పొరేషన్ల ఎన్నిక‌లు కూడా త్వ‌ర‌లోనే జ‌రుగుతాయి అనే వార్త‌లు రాజ‌కీయ పార్టీల్లో తిరుగుతున్నాయి. లోక‌ల్ లీడ‌ర్లతో పాటు స్టేట్ లీడ‌ర్లు కూడా వీటిపై ఫోక‌స్ చేశారు. జ‌నాన్ని మ‌చ్చిక చేసుకునే ప‌నిలో ఉన్నార‌క్క‌డ. ఇక ప‌ట్ట‌భ‌ద్రుల ఎల‌క్ష‌న్ల హీట్ కూడా ఉండ‌డంతో..డిగ్రీలు చేతిలో ప‌ట్టుకున్న వాళ్ల‌కి డిమాండ్ పెరిగింది. ఓటింగ్ న‌మోదు ప‌నిలో వాళ్లు కూడా బిజీగా ఉన్నారు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల కోలాహ‌లం నెల‌కొంది. ఇప్ప‌టికే దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీల నేత‌లు బిజీబిజీగా ఉన్నారు. మ‌రో మూడు నెల‌ల్లో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే పార్టీలు ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్లు న‌మోదు చేయించేందుకు విస్తృతంగా క్యాపెయిన్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో పార్టీల‌న్నీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గ్రేట‌ర్ ఎన్నిక‌లు రాబోతున్నాయి. అయితే ఎప్పుడ‌నేది క్లారిటీ లేక‌పోయినా.. బుధ‌వారం ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది. తెలంగాణ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌ధి గ్రేట‌ర్ ఎన్నిక‌లు ఎప్పుడ‌నేది స్ప‌ష్ట‌త ఇచ్చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బ్యాలెట్‌నే ఉప‌యోగించేలా ఇప్ప‌టికే ఎస్ఈసీ నిర్ణ‌యించింది. 11 పార్టీల అభిప్రాయం తీసుకోగా ఇందులో 8 పార్టీలు బ్యాలెట్‌కే మొగ్గుచూపాయి. దీంతో ఎన్నిక‌ల క‌మిష‌న్ బ్యాలెట్‌తోనే గ్రేట‌ర్ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించ‌డంతో పాటు బ్యాలెట్ బాక్స్‌ల‌ను సిద్ధంచేస్తోంది. అయితే జ‌న‌వ‌రిలో ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఆ మేర‌కు పార్టీలుసైతం సిద్ధ‌మ‌వుతున్నాయి. తాజాగా తెలంగాణ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థి గ్రేట‌ర్ ఎన్నిక‌లు ఎప్పుడ‌నేదానిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌టంతో పార్టీలు త‌మ వ్యూహాల‌కు మ‌రింత ప‌దునుపెట్ట‌నున్నాయి. బుధ‌వారం ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థి కుటుంబ స‌మేతంగా తిరుప‌తి వెళ్లారు. స్వామివారి ద‌ర్శ‌నం అనంత‌రం స్థానిక విలేక‌రులు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల తేదీపై ప్ర‌శ్నించారు. దీంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని పార్థసారథి పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికల పనులలో ఎలక్షన్ కమిషన్ అలానే సిబ్బంది అందరూ నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారం లో జీ హెచ్ ఎం సి టర్మ్ ముగుస్తుందని నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిపేలా ఆలోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేస్తామని వెల్లడించారు. సోష‌ల్ మీడియాల్లో దీనిపై ఆల్రెడీ ప్ర‌చారాలు ఫుల్ గా న‌డుస్తున్నాయి. మొత్తానికైతే వెద‌ర్ మారిపోయింది. వాతా‌‌ర‌ణం పొలిటిక‌ల్ మ‌బ్బులు క‌మ్ముకుంది. ఇక ఓట‌ర‌న్న ఆడిందే ఆట పాడిందే పాట కొన్నాళ్ల పాటు. అందులో నో డౌట్.

Related Posts