YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మ‌హాఘ‌ట్ బంధన్ లో లుక‌లుక‌లు

మ‌హాఘ‌ట్ బంధన్ లో లుక‌లుక‌లు

పాట్నా, అక్టోబ‌రు 8, 
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏను దెబ్బకొట్టి విజయం సాధించాలనుకుంటున్న మహా కూటమికి వరస దెబ్బలు తగులుతున్నాయి. బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలతో పాటు మరికొన్ని చిన్నా చితకా పార్టీలు కలసి మహాకూటమిగా ఏర్పడాలని భావించాయి. అయితే తేజస్వి యాదవ్ నాయకత్వంపై అభ్యంతరం తెలుపుతున్న పార్టీలు ఒక్కొక్కటిగా వైదొలుగుతున్నాయి. ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితిన్ రామ్ మాంఝీ మహాకూటమికి గుడ్ బై చెప్పేశారు. ఆయన ఎన్డీఏలో చేరిపోయారు. మాంఝీ కూటమి నుంచి వైదొలగడం ఒకరకంగా కోలుకోలేని దెబ్బ. ఇక తాజాగా రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ కూడా మహాకూటమి నుంచి వైదొలగింది. ఆర్ఎల్ఎస్పీ అధినేత ఉపేంద్ర కుశ్వానా కూడా ప్రత్యేకంగా కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. బీఎస్పీతో కలిసి సొంత కూటమిని పెట్టుకున్నారు.వరసగా మహాకూటమిలోని అన్ని పార్టీలూ వైదొలుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి జోక్యం చేసుకోవడం లేదు. బీహార్ రాజకీయాల్లో కాంగ్రెస్ బలంగా లేకున్నా జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉండటంతో మహాకూటమిలోని అన్ని పార్టీలూ కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి. కానీ తేజస్వి యాదవ్ మహాకూటమికి తమ పార్టీ మాత్రమే నాయకత్వం వహిస్తుందని చెబుతున్నారు. దీంతోనే అందరూ కూటమిని వీడివెళ్లిపోతున్నారు.బీహార్ రాజకీయాలను రాహుల్ గాంధీ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోకపోతే మహాకూటమికి పరాభవం తప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్ కూడా తమకు ఎక్కువ స్థానాలను కోరుకుంటుంది. ఆర్జేడీ మాత్రం అందుకు సుముఖంగా లేదు. మొత్తం మీద బీహార్ రాజకీయాల్లో మహాకూటమికి వరస దెబ్బలు తగులుతుండటం విజయావకాశాల మీద ప్రభావం చూపుతుందంటున్నారు. మరి దీని నుంచి మహాకూటమి ఎలా బయటపడుతుందో చూడాల్సి ఉంది.

Related Posts