YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నియోజక‌‌వ‌ర్గాల పెంపుపై జ‌గ‌న్ ఆశ‌

నియోజక‌‌వ‌ర్గాల పెంపుపై జ‌గ‌న్ ఆశ‌

విజ‌య‌వాడ‌, అక్టోబ‌రు 8, 
రాజకీయాలంటేనే మైండ్ గేమ్. ఎప్పుడు ఎలా వ్యవహరించాలో పార్టీ అధినేతలకు తప్ప మరెవ్వరికి తెలియదు. ప్రత్యర్థి పార్టీని మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి పెద్దయెత్తున టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకునేందుకు జగన్ సిద్దమయ్యారని చెబుతున్నారు.ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఒక అడ్వాంటేజీ ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉటుంది. ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా యాభై నియోజకవర్గాలు కొత్తవి చేరతాయి. దీంతో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 2019 ఎన్నికలకు ముందే నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో అది సాధ్యం కాలేదు.ఇప్పుడు మరోసారి జగన్ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వంతో సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల అమిత్ షాను కలిసినప్పుడు కూడా పున్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలు పెంపుదల చేయాలని జగన్ కోరినట్లు తెలిసింది. యాభై నియోజకవర్గాల పెరిగితే వచ్చే ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపు కూడా పెద్ద సమస్య కాదు. అందుకే జగన్ ఎమ్మెల్యేలను మాత్రమే కాకుండా పట్టున్న నేతలను కూడా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.ఇదే విషయాన్ని నియోజకవర్గంలో కొందరు తనకు సన్నిహితులైన ఎమ్మెల్యేల వద్ద కూడా జగన్ ప్రస్తావించినట్లు సమాచారం. నియోజకవర్గాల పెంపుదలతో టిక్కెట్ల కేటాయింపు సమస్య ఉండదని జగన్ అభిప్రాయపడుతున్నారు. అందుకే టీడీపీపై అసంతృప్తిగా ఉన్న నేతలను ఫ్యాన్ పార్టీ కండువాలు కప్పేందుకు సిద్ధమయింది. పార్టీలో చేరే వారికి ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వకపోయినా తర్వాత పరిస్థితులను బట్టి టిక్కెట్ కేటాయించవచ్చన్న ఆలోచనలో జగన్ ఉన్నారు. మొత్తం మీద నియోజకవర్గాల పెంపు అంశం మరోసారి తెరపైకి తెచ్చారు జగన్.

Related Posts