YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అమేజాన్ లో రైల్ టిక్కెట్లు

అమేజాన్ లో రైల్ టిక్కెట్లు

ముంబై‌, అక్టోబ‌రు 8, 
అమేజాన్ అంతే. అడుగు పెట్టిందంటే అక్క‌డ ర‌చ్చే. త‌న స్టైల్ మార్క్ చూసుకుంటుంది. మిగ‌తా వాళ్లంతా ఎందుకొచ్చిందిరా బాబూ అని త‌ల‌లు ప‌ట్టుకోవాల్సిందే. ఇప్పుడు చుక్ చుక్ బండి బుకింగ్ లోకి కూడా వ‌చ్చేసింది అమేజాన్. లాంగ్ జర్నీ చేస్తూ ఊరెళ్లాలంటే రైలు బండే బెట‌ర్ అనుకుంటాం క‌దా. బ‌స్సులు అయితే టిక్కెట్ రేట్ల పేరుతో బాదేస్తుంటారు..రైలు బండైతే ద‌ర్జాగా ప‌డుకుని వెళ్లొచ్చు..స‌గం రేటుకే జ‌ర్నీ చేయొచ్చు అనుకుంటాం. ఇప్పుడు ఆ స‌గం రేటులో ఇంకో పావ‌లానో ప‌ది పైస‌లో త‌గ్గ‌డం గ్యారంటీ. ఎందుకంటే అమేజాన్ సైట్ లో కూడా రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే ఛాన్స్ వ‌చ్చింది. ఆల్రెడీ ఒప్పందాలు ప‌త్రాలు ప‌ర్మిష‌న్లు అన్నీ అయిపోయాయంట‌. ఇక డిస్కౌంట్ లు తీసుకోవ‌డం బుక్ చేసుకోవ‌డం.. ఆఫ‌ర్లు అందుకోవ‌డం చెక్కేయ‌డం..అంతే. వ‌చ్చీ రాగానే ఓపెనింగ్ ఆఫ‌ర్లు క‌న్ఫామ్ చేసింది. 10 ప‌ర్సంట్ డిస్కౌంట్ ఫిక్స్ చేసింది అమేజాన్. ప్రైమ్ ఉన్న వాళ్ల‌కి ఇంకో రెండు శాతం అంటూ 12 ప‌ర్సంట్ డిస్కౌంట్ ఇస్తోందిఇప్పుడే ఇలా ఉదంటే ముందు ముందు టిక్కెట్ కాస్ట్ ఇంకా చీప్ కావ‌డం గ్యారంటీ. ఇంకేదో బ్యాంకు వాళ్లు వ‌స్తారు..ఇంకో టెన్ ప‌ర్సంట్ అంటారు. మ‌రేదో క్రెడిట్ కార్డు వాళ్లు వ‌చ్చి ఇంకో ఫైవ్ ప‌ర్సంట్ అంట‌రు. ఇలా డిస్కౌంట్ల వ‌ర‌ద వానాకాలంతో ప‌ని లేకుండా ప‌రుగులు పెడుతూనే ఉంటుంది. ఇక పండ‌గ‌లు ప‌బ్బాలు వ‌చ్చిన‌ప్పుడు ఆట‌లాడండి ఆఫ‌ర్లు అందుకోండి అంటూ అమేజాన్ బంప‌ర్ ఆఫ‌ర్లు ఇవ్వ‌డం గ్యారంటీ.ఈ వార్త తెలిసిన జ‌నాలు..పెట్రోల్ బుకింగుకి కూడా వ‌స్తే బాగుండు..మ‌ట‌న్ మార్కెట్ లోకి.. కూర‌గాయ‌ల మార్కెట్ లోకి కూడా వ‌స్తే బావుండు అంటున్నారు. కంగారేం లేదు. ముందు ముందు చాలా మార్కెట్స్ లోకి వ‌స్తుంది. మ‌న‌కి కూడా అవ‌కాశాలు బానే ఉంట‌య్. ప్ర‌జెంట్ గా అయితే వ‌చ్చిన ఆఫ‌ర్లు ఎంజాయ్ చేస్తే పోలా.

Related Posts